అంతర్జాతీయం

పాక్‌కు అండగా ఉంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఆగస్టు 22: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్తాన్‌కు తాజాగా చేసిన హెచ్చరికలపై చైనా ప్రతిస్పందించింది. పాకిస్తాన్‌కు అనుకూలంగా బలమైన స్వరాన్ని వినిపించింది. ఆఫ్గనిస్తాన్, దక్షిణాసియా విధానాన్ని సోమవారం ప్రకటించిన ట్రంప్ పాకిస్తాన్ ఉగ్రవాద శక్తులకు స్వర్గ్ధామంగా ఉందని పేర్కొన్నారు. అరాచక శక్తులకు అడ్డాగా మారిందని, ఆఫ్గనిస్తాన్‌లో అమెరికన్లను హతమారుస్తున్నది పాకిస్తాన్ ఉగ్రశక్తులేనని, తీరు మారకుంటే ఇస్లామాబాద్ చాలా నష్టపోతుందని హెచ్చరించారు. దీనిపై చైనా అంతే తీవ్రంగా స్పందించింది. ‘పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాటంలో అన్ని దేశాలకంటే ముందుంది. టెర్రరిస్టుల దాడుల్లో పాకిస్తాన్ చాలా నష్టపోయింది. దక్షిణాసియాలో శాంతిస్థాపనకు పాకిస్తాన్ కట్టుబడి ఉంది. ఈ ప్రాంతంలో శాంతి సుస్థిరతలకు తగిన విధంగా అమెరికా తన విధానాన్ని రూపొందించుకుంటుందని ఆశిస్తున్నాం’ అని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ తెలిపారు. పాకిస్తాన్ పట్ల చైనా తన మిత్రధర్మాన్ని పూర్తిగా ప్రకటించింది. పాకిస్తాన్‌కు అన్ని రకాలుగా అండగా ఉంటామని స్పష్టం చేసింది.