అంతర్జాతీయం

హద్దు లేనిది.. మన ఫ్రెండ్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హెరత్, జూన్ 4: ఎన్ని అడ్డంకులు ఎదురైనా భారతదేశం అఫ్గానిస్థాన్‌లోని అన్ని ప్రాంతాలకూ సహాయాన్ని కొనసాగిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శనివారం అఫ్గాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీతో కలిసి అఫ్గాన్- ఇండియా ఫ్రెండ్‌షిప్ డ్యామ్ ప్రారంభించారు. ఇంతకుముందు సల్మా డ్యామ్‌గా పిలిచే ఈ డ్యామ్‌ను ఇరాన్‌ను ఆనుకుని ఉన్న హెరత్ రాష్ట్రంలోని చిస్త్-ఎ-షరీఫ్ వద్ద హరిరుద్ నదిపై భారత్ 1700 కోట్ల వ్యయంతో నిర్మించింది. ఈ డ్యామ్ ద్వారా 75 వేల ఎకరాలకు సాగు నీరు అందడంతోపాటుగా 42 మెగావాట్ల విద్యుదుత్పత్తి అవుతుంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు తాగునీటి సౌకర్యం లభిస్తుంది. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇది అభివృద్ధి వైపు అఫ్గాన్ వేసిన మరో ముందడుగని అన్నారు. సాహస వీరులైన అఫ్గాన్ ప్రజలు ఈరోజు ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని అందిస్తున్నారన్నారు. ఉగ్రవాదాన్ని అంతమొందించడంలో అఫ్గానిస్థాన్ విజయవంతమైనప్పుడు ప్రపంచం మరింత సురక్షితంగా, అందంగా ఉంటుందని
మోదీ అన్నారు. ఈ డ్యామ్ ఇటుకలు, బండరాళ్లతో నిర్మించబడలేదని, అఫ్ఘన్లు, భారతీయుల శక్తి సామర్థ్యాలు, స్నేహబంధం యొక్క విశ్వాసంతో నిర్మించబడిందని అన్నారు. అఫ్గానిస్థాన్‌కు అన్ని విధాలుగా అండగా ఉంటామని పునరుద్ఘాటించిన ప్రధాని, భారత దేశ సహకారం యుద్ధాలతో కకావికలమైన అఫ్గానిస్థాన్‌లోని అన్ని ప్రాంతాలకూ కొనసాగుతుందని, ఈ స్నేహబంధం వల్ల అఫ్గాన్ సమాజంలోని ప్రతి వర్గమూ లాభపడుతుందని అన్నారు. ‘మీ కళ్లలో భారత్ పట్ల సమున్నతమైన ప్రేమానురాగాలు చూస్తున్నందుకు గర్విస్తున్నాను’ అని మోదీ అన్నారు.
విలేఖరుల సమావేశంలో మోదీతో కలిసి పాల్గొన్న అఫ్గాన్ అధ్యక్షుడు ఘనీ ‘మీ రెండో ఇల్లు అఫ్గానిస్థాన్‌కు స్వాగతం’ అంటూ ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. భారత్- అఫ్గాన్ చిరకాల మైత్రీ బంధానికి గుర్తుగా మనం ఇక్కడ కలిశామన్నారు. భారత దేశ సహకారంలో అఫ్గాన్ల 30 ఏళ్ల కల నెరవేరిందన్నారు. అప్గానిస్థాన్‌లో భారతదేశం పాత్ర పట్ల ఇతరుల్లో ప్రతిఘటన, అనుమానాలున్నాయని ప్రధాని అంటూ, అయితే తమ కృతనిశ్చయం ఎంతో దృఢమైందని, అది ఈ దేశాన్ని సుఖ సంతోషాల పథంలో ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఇతరుల కుటిల యత్నాలనుంచి ఈ స్నేహబంధాన్ని కాపాడుకోవాలన్న అఫ్గాన్ల కృతనిశ్చయం నుంచి భారత దేశం బలాన్ని, విశ్వాసాన్ని సముపార్జించుకుందని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశిస్తూ మోదీ చెప్పారు. తాము ప్రారంభించిన డ్యామ్ గురించి మాట్లాడుతూ తాము ఈరోజు కేవలం భూములకు సాగు నీరందించే, ఇళ్లకు వెలుగులిచ్చే ప్రాజెక్టును మాత్రమే ప్రారంభించడంలేదని, ఓ ప్రాంతాన్ని పునరుజ్జీవింపజేస్తున్నామని, అఫ్గాన్ భవిష్యత్తును పునర్నిర్వచిస్తున్నామన్నారు.

చిత్రం ఆఫ్గాన్ పర్యటనలో భాగంగా హెరత్‌లోని ఓ శిల్పకళా కేంద్రంలో కళాఖండాలను ఆ దేశాధ్యక్షుడు అష్రాఫ్‌తో కలిసి తిలకిస్తున్న ప్రధాని మోదీ