బిజినెస్

* వరుసగా రెండోవారం లాభాల్లో స్టాక్‌మార్కెట్లు
* సెన్సెక్స్ 270, నిఫ్టీ 88 పాయింట్ల లాభం
* 3వేల కోట్లకుపైగా ఎఫ్‌ఐఐల పెట్టుబడులు
==============
* వారాంతపు సమీక్ష
==============
ముంబయి, ఏప్రిల్ 27: వచ్చేవారం రిజర్వ్ బ్యాంకు జరిపే ద్రవ్యవిధాన సమీక్షలో వడ్డీరేట్లు తగ్గుతాయనే ఆశ మదుపర్లను పెట్టుబడులకు ఉసిగొలిపింది. ఫలితంగా దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోవారం కూడా లాభాల బాట పట్టాయి. చివరిరోజు అమ్మకాల ఒత్తిడికి గురైనప్పటికీ గడిచినవారం మొత్తంగా మార్కెట్లు లాభాలనే నమోదు చేశాయి. ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో మే 3న జరిగే ద్రవ్యవిధాన సమీక్షలో ఆర్‌బిఐ వడ్డీరేట్లను తగ్గిస్తుందనే అంచనాలు మదుపర్లలో అధికమయ్యాయని మార్కెట్ విశే్లషకులు చెబుతున్నారు. కాగా, దేశీయ మదుపర్లతోపాటు విదేశీ సంస్థాగత మదుపర్లు (ఎఫ్‌ఐఐ) పెట్టుబడులు పెట్టేందుకు అమితాసక్తిని ప్రదర్శించారు. గడిచినవారం ఎఫ్‌ఐఐల పెట్టుబడులు 3,045.95 కోట్ల రూపాయలుగా ఉన్నా యి. అయితే ఆర్‌బిఐ సమీక్షపై అంచనాలతో బ్యాంకింగ్ రంగానికి కొనుగోళ్ల మద్దతు లభించగా, అమెరికా సెనెట్‌లో ఇమ్మిగ్రేషన్ బిల్లులోని అంశాలు చర్చకు రావడంపై నెలకొన్న ఆందోళనలతో ఐటి రంగం అమ్మకాల ఒత్తిడికి లోనైంది. భారతీయ ఐటి సంస్థలకు అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న అమెరికాలో ఇమ్మిగ్రేషన్ నిబంధనలు ప్రతికూలంగా మారతాయేమోననే భయం మదుపర్లను వెంటాడింది. ఈ క్రమంలోనే ఐటి రంగ షేర్లపై మదుపర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. దీంతో విప్రో, ఇన్ఫోసిస్, టిసిఎస్ షేర్లు నష్టాలను చవిచూశాయి. అయినప్పటికీ అంతకుముం దు రోజుల్లో నమోదైన లాభాలతో మార్కెట్లు గడిచినవారంలో రెండోవారం లాభాలను నిలుపుకోగలిగా యి. దీంతో చివరకు సెన్సెక్స్ 270.26 పాయింట్ల లాభంతో 19,286.72 వద్ద, నిఫ్టీ 88.35 పాయింట్ల లాభంతో 5,871.45 వద్ద ముగిశాయి. ఇక గడిచిన రెండు వారాల్లో బిఎస్‌ఇ 1,04 4.16 పాయింట్లు పెరగగా, ఎన్‌ఎస్‌ఇ 342.90 పాయింట్లు పెరిగింది. అధికంగా లాభపడ్డ షేర్లలో మారుతి సుజుకీ 9.64 శాతం, కోల్ ఇండియా 6.63, హెచ్‌డిఎఫ్‌సి 6.59, ఎయిర్‌టెల్ 6.32, హీరో మోటో కార్ప్ 6.28, ఎన్‌టిపిసి 6.10, హిందాల్కో 5.71 శాతం చొప్పున లాభపడ్డాయి. నష్టపోయిన షేర్లలో అత్యధికంగా విప్రో 10.45 శాతం, జిందాల్ స్టీల్ 6.52, టిసిఎస్ 5.69, హిందుస్థాన్ యునీలివర్ 3.69, ఇన్ఫోసిస్ 3.62 శాతం చొప్పున నష్టపోయాయి. ఆయా రంగాలవారీగా చూస్తే ఆటో 4.11 శాతం, క్యాపిటల్ గూడ్స్ 3.16 శాతం, కన్జ్యూమర్ డ్యూరబుల్ 2.48 శాతం, పవర్ 2.02 శాతం, బ్యాంకింగ్ 2.04 శాతం లాభపడ్డాయి. ఐటి 4.83 శాతం, టెక్నాలజీ 2.24 శాతం నష్టపోయాయి. టర్నోవర్ విషయానికొస్తే గడిచినవారం సెనె్సక్స్ 8,790.56 కోట్లు, నిఫ్టీ 48,692.75 కోట్లుగా ఉంది. అంతకుముందు వారం సెనె్స క్స్ టర్నోవర్ 8,242.21 కోట్లు, నిఫ్టీ టర్నోవర్ 46,997.76 కోట్లుగా ఉంది.
Add new comment