అంతర్జాతీయం

పాక్ యుద్ధ విమానాల చక్కర్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: సియాచిన్ మంచుదిబ్బ సమీపంలోని గగనతలంలో పాకిస్తాన్ యుద్ధ విమానాలు బుధవారం చక్కర్లు కొట్టాయని మీడియా కథనం వెల్లడించింది. అయితే భారత గగనతలంలో ఎలాంటి ఉల్లంఘనలు చోటు చేసుకోలేదని భారత వాయుసేన (ఐఎఎఫ్) వర్గాలు బుధవారం ఢిల్లీలో తెలిపాయి. పాకిస్తాన్ వాయు సేన (పిఎఎఫ్) యుద్ధ విమానాలు బుధవారం ఉదయం సియాచిన్ మంచుదిబ్బ సమీపంలో చక్కర్లు కొట్టాయని సమత టివి ఒక కథనం ప్రసారం చేసింది. పిఎఎఫ్‌కు చెందిన ఫార్వర్డ్ ఆపరేటింగ్ స్థావరాలను పూర్థి స్థాయిలో సంసిద్ధం చేసినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ టివి కథనం పేర్కొంది. పిఎఎఫ్‌కు చెందిన మిరేజ్ యుద్ధ విమానాలు కూడా ఈ విన్యాసాలలో పాల్గొన్నాయని పేర్కొంది. పాకిస్తాన్‌ను శిక్షించేందుకు నియంత్రణ రేఖ వెంట దాని పోస్టులపై ఈ నెల మొదట్లో దాడి చేసినట్లు భారత సైన్యం మంగళవారం ప్రకటించిన నేపథ్యంలో ఈ టివి కథనం ప్రసారమయింది. పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్ట్ఫా ఎయిర్ చీఫ్ మార్షల్ సొహైల్ అమన్ బుధవారం స్కర్దులో గల ఫార్వర్డ్ వైమానిక స్థావరాన్ని సందర్శించారని, మిరేజ్ జెట్‌లో గగనతలంలోకి వెళ్లారని ఆ టివి కథనం తెలిపింది.

లాలూ కుమార్తెకు
ఐటి సమన్లు
న్యూఢిల్లీ, మే 24: బినామీ భూములు, పన్నుల ఎగవేత కేసులో ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె, ఎంపీ మిసా భారతి, అల్లుడుకి ఐటి శాఖ సమన్లు జారీ చేసింది. చార్టెడ్ అకౌంట్ రాజేశ్ కుమార్ అగర్వాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన తరువాత ఈ పరిణామం చోటుచేసుకుంది. వెయ్యి కోట్ల విలువైన బినామీ భూములు లావాదేవీలకు సంబంధించి అగర్వాల్‌ను సోమవారం ఈడి అదుపులోకి తీసుకుంది. లాలూ కుమార్తెకు సంబంధించిన లావాదేవీలన్నీ ఆయనే చూసేవాడు. జూన్ మొదటి వారంలో విచారణ అధికారి ఎదుట హాజరుకావాల్సిందిగా లాలూ కుమార్తె భారతి, అల్లుడు శైలేష్ కుమార్‌లకు సమన్లు జారీ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నెల 16న లాలూకు చెందిన బినామీ సంస్థలపై ఐటి సోదాలు జరిగాయి. మిషైల్ ప్యాకర్స్ అండ్ ప్రింటర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో భారతి, ఆమె భర్తకు సంబంధాలున్నట్టు విచారణలో వెల్లడైంది.

ఢిల్లీలోని బిజ్వాసన్‌లోని ఫామ్ హౌస్ కొనుగోలులోనూ బినామీ వ్యవహారాలు నడిచాయని, వాటితో లాలూ కుమార్తె, అల్లుడి పాత్ర ఉన్నట్టు ఐటి అధికారులు అనుమానిస్తున్నారు.