జాతీయ వార్తలు

‘టైమ్ 100’ ప్రాబబుల్స్‌లో మోదీ, సానియా, ప్రియాంక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూయార్క్, మార్చి 24: టైమ్ మ్యాగజైన్ ఏడాదికోసారి ప్రకటించే ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురయిన వ్యక్తుల జాబితాలో చోటుకోసం పోటీ పడుతున్న వారిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఉన్నారు. ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురయిన వంద మంది వ్యక్తుల జాబితాను టైమ్ మ్యాగజైన్ వచ్చే నెలలో ‘టైమ్ 100’ పేరిట ప్రకటించనుంది. 127 మంది ప్రపంచ నాయకులు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన గొప్ప మేధావులు, కళారంగంలో విశేష సేవలందించిన వారు, ఇతర ప్రముఖుల్లోనుంచి గుర్తింపునకు అర్హులయిన వారికి ఓటు వేయాల్సిందిగా టైమ్ మ్యాగజైన్ తన పాఠకులను కోరింది. ‘మోదీ ప్రపంచ వేదికపై శక్తివంతమైన గొంతుగా కొనసాగుతున్నారు’ అని టైమ్ పేర్కొంది. అయితే 2015లో ‘రాజకీయ తగాదాల వల్ల తన దేశీయ అజెండా పక్కదారి పట్టిందని’, అయినప్పటికీ తమ దేశం ఆర్థికాభివృద్ధిలో ప్రపంచానికి నేతృత్వం వహిస్తుందని మోదీ భావిస్తున్నారని టైమ్ తెలిపింది. టైమ్ మ్యాగజైన్ గత సంవత్సరం ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీలురయిన వంద మంది వ్యక్తుల జాబితాలో మోదీ చోటు దక్కించుకున్నారు. టైమ్ మ్యాగజైన్‌కు మోదీ గురించి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రొఫైల్ రాశారు. ఇక సానియా మీర్జా భారత్‌లోని అత్యుత్తమ మహిళా టెన్నిస్ ప్లేయర్ కావడమే కాకుండా ప్రపంచ మహిళల డబుల్స్‌లో ప్రథమ ర్యాంక్ సాధించడంతో పాటు స్వదేశంలో మహిళా అథ్లెట్ల పాత్రను పునర్ నిర్వచించడంలో దోహదపడుతున్నారని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరిగా నిలవడంతో పాటు హాలీవుడ్ దృష్టిని ఆకర్షించారని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది.
భారత్‌లో జన్మించి ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలయిన గూగుల్, మైక్రోసాఫ్ట్‌లకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారులు (సిఇఓలు)గా పనిచేస్తున్న సుందర్ పిచాయి, సత్య నాదెళ్ల కూడా 127 మందితో కూడిన జాబితాలో ఉన్నారని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. భారతీయ సంతతికి చెందిన నటుడు అజీజ్ అన్సారీ పేరు కూడా ఈ జాబితాలో ఉంది.