అంతర్జాతీయం

సమాచార భద్రతకు ప్రాధాన్యమిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఏప్రిల్ 11: 2018 చాలా కీలక సంవత్సరం. ఇండియా, బ్రెజి ల్, మెక్సికో, పాకిస్తాన్ వంటి దేశాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో సమాచార భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తామని ఫేస్‌బుక్ వ్య వస్థాపకుడు, సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అన్నారు. కేంబ్రిడ్జి అనెలిటికా, ఫేస్‌బుక్ యూజర్ల సమాచారాన్ని సేకరించకుండా అడ్డుకోలేకపోవడం తమ వైఫల్యమేనని అంగీకరించారు. కేంబ్రిడ్జి అనెలిటికా స్కాండల్‌పై సెనెటర్లు తనను ఐదుగంటల పాటు ప్రశ్నించారని జుకర్‌బర్గ్ చెప్పారు. ఫేస్‌బుక్ బో ర్డు సమావేశంలో ఎన్నికల్లో విదేశీ ప్రమేయంపై తీవ్రంగా చర్చించామన్నారు. ‘దీన్ని అరికట్టడానికే 2018లో అధిక ప్రాధాన్యతనిస్తాం’ అన్నారు. ఈ నేపథ్యంలోనే అమెరికా, భారత్, బ్రెజిల్, పాకిస్తాన్ దేశాల్లో ఎన్నికలు జరుగునన్న తరుణంలో, యూజర్ల సమాచార భద్రతకే తమ తొలి ప్రాధాన్యత ఆని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు పూర్తి విశ్వాసం ఏర్పడిందని, పరిస్థితులన్నింటినీ కంపెనీ చక్కదిద్దిందన్నారు. అమెరికాలో 2016లో ఎన్నికలు జరిగిన తర్వాత ఫ్రాన్స్, జర్మనీల్లో, యుఎస్ అలాబామా స్పెషల్ ఎన్నికలు జరిగాయన్నారు. ‘ఈ ఎన్నికలకు ముందు ప్రమాదకరంగా భా వించిన వేలాది అకౌంట్లను తొలగించాం’ అని జుకర్‌బర్గ్ వెల్లడించారు. కాగా రష్యన్ ఆపరేటర్లు సమాచారం తస్కరించకుండా తాము నిరంతరం పోరాడుతున్నామని జుకర్‌బర్గ్ సెనెటర్లకు తెలిపారు. ప్రస్తుతం తాము కొన్ని కృత్రిమ మేధతో కూడిన ఉపకరణాలను ప్రవేశపెట్టామని, ఇవి ఫేక్ అకౌంట్లను సృష్టించే వారిని గుర్తిస్తాయని పేర్కొన్నారు. అయితే ఈ స్కాం డల్ తర్వాత ఈ సోషల్ నెట్‌వర్క్‌ను నియంత్రించే అవకాశాలపై సెనెటర్లు ప్రస్తావించగా, ‘అటువంటి నియంత్రణ వస్తే మంచిదే’ అని ముక్తసరిగా సమాధానమిచ్చారు. నిజానికి ఈ స్కాండల్‌తో ఫేస్‌బుక్ చాలామంది యూజర్ల విశ్వాసం కోల్పోయింది. ఎంతోమంది ఇప్పటికే ఈ సోషల్ మీ డియా సైట్‌కు గుడ్‌బై చెప్పడం గమనార్హం.

చిత్రం: వాషింగ్టన్‌లోని ద కామర్స్ అండ్ జ్యుడీషియల్ కమిటీ ముందు హాజరై వివరణ ఇస్తున్న ఫేస్‌బుక్ సీఈఓ జుకర్‌బర్గ్