అంతర్జాతీయం

కిమ్ జొంగ్-ఉన్ చైనాలో అనధికార పర్యటన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మార్చి 28: ఉత్తర కొరియా నియంత కిమ్ జొంగ్-ఉన్ పర్యటనపై నిన్నటినుంచి వౌనంగా ఉన్న చైనా ఎట్టకేలకు స్పందించింది. కిమ్ పర్యటన నిజమేనని ప్రకటించింది. కాగా కిమ్ చైనాలో ఆదివారం నుంచి బుధవారం వరకు నాలు గు రోజుల పాటు అనధికారిక పర్యటన జరిపారు. 2011లో అధికారాన్ని హస్తగతం చేసుకున్న తర్వాత, కిమ్ విదేశంలో పర్యటించి, దేశాధినేతను కలవడం ఇదే ప్రథమం. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆహ్వానం మేరకు కిమ్ చైనాలో పర్యిటించారని చైనా అధికార వార్తా సంస్థ జిన్‌హువా వెల్లడించిం ది. ఈ సందర్భంగా ఆయన జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో త్వరలో సమావేశం కానున్న కిమ్ జోంగ్ ఉన్, ముందుగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా జిన్‌పింగ్ మద్దతును ఆయన కోరినట్టు సమాచారం. కొరియా ద్వీపకల్పాన్ని అణ్వస్త్ర రహితం చేయడానికి సిద్ధమేనని కిమ్ ప్రకటించడం విశేషం. బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ ది పీపుల్‌లో వీరిద్దరూ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా జిన్‌పింగ్ దంపతులు, కిమ్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. అక్కడి కళారూపాలను ఇద్దరూ తిలకించారు. చైనా ప్రీమియర్‌తో పాటు కమ్యూనిస్టు పార్టీకి చెందిన ముఖ్యనేతలు కూడా ఈ సందర్భంగా ఉన్నట్టు జిన్‌హువా పేర్కొంది. కాగా జిన్‌పింగ్‌తో మంచి సంబంధాలు కలిగివున్న కిమ్, వచ్చే నెలలో దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జెయ్-ఇన్‌తోను, మేనెలలో డోనాల్డ్ ట్రంప్‌తోను సమావేశం కానున్నారు. అమెరికా, ఉత్తరకొరియా, దక్షిణ కొరియా, జపాన్, ర ష్యా, చైనా దేశాల మధ్య చర్చలకు మార్గం సుగ మం చేయడంలో చైనా కీలకపాత్ర పోషించింది. ఉత్తరకొరియాకు ముకుతాడు వేయడంకోసం, చమురు, బొగ్గు ఇతర అత్యవసర సరుకులను ఆ దేశానికి సరఫరా చేయవద్దని ట్రంప్ యంత్రాంగం, చైనాపై ఒత్తిడి తెచ్చింది. ఈ నేపథ్యంలో కొద్ది నెలల క్రితం జిన్‌పింగ్ తన ప్రత్యేక ప్రతినిధి సాంగ్ టావోను ఉత్తర కొరియాకు పంపగా, ఆయన్ను కలవడానికి కిమ్ అంగీకరించలేదు. కానీ ఈ నెల లో జిన్‌పింగ్ అత్యంత శక్తిమంతుడుగా మారడం, జీవితాంతం చైనా అధ్యక్షుడిగా కొనసాగడానికి మార్గం సుగమం కావడం వంటి పరిణామాల నేపథ్యంలో కిమ్ చైనాలో ఆకస్మిక పర్యటన జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా ఉత్తరకొరియా శాంతి ప్రక్రియలో, చైనా పాత్రను, ఆదేశ ఇబ్బందిని గుర్తించిన కిమ్ చైనాలో పర్యటించారని భావించాల్సి ఉంటుంది.ఈ నేపథ్యంలోనే కిమ్, దక్షిణ కొరియాతో మైత్రీ చర్చల ప్రస్తావనను తీసుకొని రావడం గమనార్హం.