రాష్ట్రీయం

ఉప ఎన్నికల ఫలితాలపై విపక్షాల పోస్టుమార్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఫలితాలపై కాంగ్రెస్, బిజెపిల అంతర్మథనం
ఓటమిని జీర్ణించుకోలేని వామపక్షాలు
వరంగల్‌లో వైఎస్సార్‌సిపికి నో ఎంట్రీ

వరంగల్, నవంబర్ 24: వరంగల్ పార్లమెంటు నియోజకవర్గ ఉప ఎన్నికల ఫలితాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.
జాతీయ పార్టీ అభ్యర్థులను మట్టి కరిపించారు. ఊహకందని మెజార్టీతో ప్రతిపక్షాల దిమ్మతిరిగింది. ఎన్నికల ప్రచారంలో టిఆర్‌ఎస్‌తో హోరాహోరీగా పోటీపడిన కాంగ్రెస్, బిజెపి పార్టీల అభ్యర్థులకు కనీసం డిపాజిట్ కూడా గల్లంతయింది. కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మొదటి సారిగా బరిలోకి దిగిన వైఎస్సార్‌సిపి, ఉప ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థిని ప్రకటించిన వామపక్షాలకు ఎన్నికల ఫలితాలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఓరుగల్లు ప్రజలు టిఆర్‌ఎస్‌కు ఇంతటి భారీ విజయం కట్టబెట్టడం వెనుక గల కారణాలను రాజకీయ పరిశీలకులు జాగ్రత్తగా విశే్లషిస్తున్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలన ప్రారంభమై 16 నెలలు పూర్తికావడంతో ప్రజల్లో మొదలైన ప్రభుత్వ వ్యతిరేకత తమకు లాభిస్తుందని ఆశించిన ప్రతిపక్షాలకు తీవ్రమైన భంగపాటు ఎదురైంది. ప్రభుత్వ అంతరంగిక సర్వేలో వచ్చిన ఫలితాలను సైతం తలకిందులు చేస్తూ ప్రజలు టిఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం పట్టారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ వైఖరే కారణమని ప్రతిపక్షాలు పదేపదే చెపుతూ వచ్చినప్పటికి ప్రజలు పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీలను కూడా నెరవేర్చలేదని చెప్పుకుంటూ వచ్చినా ప్రజలు మాత్రం ఖాతరు చేయకుండా టిఆర్‌ఎస్‌కే బ్రహ్మరథం పట్టారు. టిఆర్‌ఎస్‌కు గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీ రాకపోయినా గెలుపు ఖాయమని అందరూ భావించినప్పటికి ఇంత భారీ మెజార్టీని మాత్రం ఎవరు ఊహించలేదు. తెలంగాణను ఇచ్చింది మేమే అంటూ సోనియాగాంధీ రుణం తీర్చుకోవడానికి వరంగల్ పార్లమెంటు స్థానాన్ని బహుమతిగా ఇవ్వాలంటూ జాతీయ స్థాయి నాయకులు చేసిన ప్రచారాన్ని ప్రజలు పట్టించుకోలేదు. ఇక బిజెపి కేంద్రంలో అధికారం తమదే ఉన్నందున వరంగల్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రులు వచ్చి ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే వరంగల్ నగరాన్ని కేంద్రం స్మార్ట్‌సిటీలో చోటు కల్పించినా మరికొన్ని పథకాలు ప్రకటించినప్పటికి ప్రజలు మాత్రం టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టారు. ఇక వైఎస్సార్‌సిపి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒకప్పుడు పరకాల ఉప ఎన్నికల సందర్భంగా ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొండా సురేఖ అప్పటి టిఆర్‌ఎస్ అభ్యర్థి మొలుగూరి బిక్షపతిపై గెలుపు అంచు వరకు వచ్చినా ఆ పార్టీ ప్రస్తుతం వరంగల్‌లో పూర్తిగా ఉనికిని కోల్పోయింది. స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా సాధించలేదు. అప్పటి ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్.జగన్ కనీసం ప్రచారం కూడా చేయకపోయినా కొండా సురేఖ గెలుపు అంచువరకు వచ్చింది. కానీ ఈ ఉప ఎన్నికలో పోటీ చేసిన వైఎస్సార్‌సిపి అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ తరపున జిల్లాలో నాలుగు రోజులు విస్తృతంగా పర్యటించి బహిరంగసభలు, రోడ్‌షోలు చేసినా ఘోరపరాభవాన్ని చవిచూశారు. దీంతో వైఎస్సార్‌సిపి క్యాడర్‌లో తీవ్ర నిరుత్సాహం నెలకొంది. ఇక వామపక్షాల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే అభ్యర్థిని ప్రకటించి పది వామపక్షాల పార్టీల మద్దతుతో బరిలోకి దిగిన గాలి వినోద్‌కుమార్ ఘోరంగా ఓటమి పాలయ్యారు. కనీసం దరిదాపుల్లో కూడా లేకుండా పోయారు.