బిజినెస్

ఏపిలో పెట్టుబడులకు ఆస్ట్రేలియా ఆసక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిఎం చంద్రబాబుతో ‘హెలియోస్టాట్’ చర్చలు
అనంతలో సౌర-పవన విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు రెడీ
పరికరాల తయారీ, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు సన్నాహాలు

విజయవాడ, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్‌లో సౌర, పవన విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియన్ కంపెనీ ఒకటి ముందుకొచ్చింది. త్వరలో అనంతపురంలో సౌర, పవన మిశ్రమ విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆస్ట్రేలియాకు చెందిన హెలియోస్టాట్ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం నారా చంద్రబాబునాయుడును కలిసిన సంస్థ ప్రతినిధులు ఈ మేరకు ప్రాథమిక చర్చలు జరిపారు. త్వరలో సవివర ప్రాజెక్టు నివేదికతో వచ్చి అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటామని చెప్పారు. సౌర-తాప విద్యుత్ రంగంలో తాము నిష్ణాతులమని సంస్థ సిఇవో జేసన్ మే, ఉపాధ్యక్షుడు కల్నల్ యద్వేంద్ర సహా ముఖ్యమంత్రికి వివరించారు. ఆస్ట్రేలియాలో సౌర-తాప విద్యుత్ ఉత్పత్తి వ్యయం బాగా ఎక్కువగా ఉన్నందున తూర్పు తీర ఆసియా దేశాలతో వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చామని చెప్పారు. ఏపీలో ఉన్న వనరుల దృష్ట్యా ఇక్కడ ఈ తరహా విద్యుత్ ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉంటుందన్నారు. ఏపీలో సౌర విద్యుత్ పరికరాల తయారీ, పరిశోధన-అభివృద్ధి, విద్యుత్ ఉత్పాదన రంగాల్లో పెట్టుబడులు పెడతామని తెలిపారు. ఏపీలో ప్రతిపాదిత ఇంధన విశ్వవిద్యాలయానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించాలని ముఖ్యమంత్రి హెలియోస్టాట్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. ఇంధన రంగంలో నిరంతర పరిశోధనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఈ రంగంలో తమకు సహకరించాలని ముఖ్యమంత్రి ఈ బృందాన్ని కోరారు. ఐదు విభాగాల్లో ఏపీ విద్యుత్‌శాఖ ఇటీవలే భారత ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్న విషయాన్ని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన నాటికి 22.5 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు ఉండేదని, కొద్ది రోజుల్లోనే మిగులు విద్యుత్ సాధించి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామన్నారు. రానున్న 4,5 సంవత్సరాల్లో 18-22వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. విద్యుత్ రంగంలో వాణిజ్య, సాంకేతిక నష్టాలు తగ్గించడంలో, ఇతర అంశాల్లో ప్రస్తుతం తమ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు సాంకేతిక సలహాదారుగా ఉందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పాదకత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. ఈ లక్ష్యసాధనకు సహకరించే అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఇంధన శాఖ కార్యదర్శి అజయ్‌జైన్, సంస్థ డైరక్టర్ నీలిమాచౌదరి, జనరల్ మేనేజర్ టివి రాఘవాచార్యులు పాల్గొన్నారు.