రాష్ట్రీయం

ఇరిగేషన్‌కు పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రూ.25వేల కోట్ల కేటాయింపు
పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్‌కు రూ.7861 కోట్లు
కాళేశ్వరానికి రూ. 6286 కోట్లు
మహారాష్టత్రో ప్రాజెక్టులపై చారిత్రక ఒప్పందం
2017-18 నాటికి వందశాతం రుణ మాఫీ
మూడేళ్లలో 23,912 మెగావాట్ల విద్యుదుత్పత్తి
ఖరీఫ్ నుంచి 9 గంటల ఉచిత విద్యుత్

హైదరాబాద్, మార్చి 14: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం మూడవ బడ్జెట్‌లో సాగునీటి రంగానికి, మిషన్ కాకతీయ పనుల కోసం పెద్ద పీట వేసింది. సాగునీటి రంగానికి రూ.25వేల కోట్ల నిధులు కేటాయించింది. పాలమూరు- రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి రూ. 7861 కోట్లు, కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ. 6286 కోట్లు, సీతారామ, భక్తరామదాసు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు రూ.1152 కోట్లు కేటాయించారు. తెలంగాణలో కోటి ఎకరాలకు సాగునీరు అందివ్వాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ వాటా 1250 టిఎంసి. ఇందులో 150 టిఎంసిలకు పైగా మిగులు జలాల్లో తెలంగాణ వాటా ఉంది. మిగులు జలాల్లో ప్రాణహిత, ఇంద్రావతి నదుల ద్వారా మాత్రమే నీరు లభ్యమవుతుందని, అందుకే ఆ నీళ్లను ఒడిసి పట్టుకుని పంట పొలాలకు అందివ్వాలన్నదే ప్రాజెక్టుల రీ డిజైన్ లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధ అయిన వ్యాప్కోస్ (వాటర్ అండ్ పవర్ కనె్సల్టెన్సీ సర్వీసస్) ద్వారా కూలంకషంగా సర్వే నిర్వహించినట్లు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. లైడార్ సర్వేలు చేయించామని, సరైన ప్రణాళికలతో ప్రాజెక్టులు కట్టాలని నిర్ణయించామన్నారు. గోదావరి, ప్రాణహిత, పెన్‌గంగ నదులపై నిర్మించదలపెట్టిన ప్రాజెక్టుల విషయంలో మహారాష్ట్రప్రభుత్వం సహకరిస్తున్నదని, ఈ నెల 8న మహారాష్టత్రో అంతర్రాష్ట్ర ప్రాజెక్టులపై చారిత్రక అవగాహన ఒప్పందాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు కుదుర్చుకున్నారన్నారు. రెండు రాష్ట్రాల్లో ఉన్న ఉమ్మడి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి అంశాలపై వచ్చే సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునేందుకు అంగీకారం కుదిరింది. దీని కోసం ఉమ్మడి అంతర్రాష్ట్రీయ బోర్డును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ అవగాహన ఫలితంగా గోదావరిపై మేడిగడ్డ, ప్రాణహితపై తుమ్మిడి హట్టి, పెన్‌గంగపై రాజుపేట, చనఖా-కొరటా, పెన్ పహాడ్ బ్యారేజీల నిర్మాణానికి మార్గం సుగమమైంది. దక్షిణ తెలంగాణకు పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా, ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లివ్వాలని నిర్ణయించారు. ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు, శ్రీసీతారామ ప్రాజెక్టు, భక్తరామదాసు ప్రాజెక్టుల ద్వారా ఖమ్మం జిల్లాకు సాగునీరు అందిస్తామని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఏడాదికి తొమ్మిది వేల చెరువులల చొప్పున గత ఏడాది మొదటి విడత మిషన్ కాకతీయ ప్రజల భాగస్వామ్యంతో నడిచింది. రెండవ విడతను త్వరలో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
2018 నాటికి మొత్తం పంట రుణాల మాఫీ
2017-18 నాటికి వందకు వంద శాతం రైతుల పంట రుణాలను మాఫీ చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో మంత్రి ఈటల రాజేందర్ ప్రకటించారు. వచ్చే ఏడాది బడ్జెట్‌లో రుణమాఫీకి రూ.3718కోట్ల నిధుల కేటాయించారు. వ్యవసాయ శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్ శాఖలకు రూ. 6759 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రాష్ట్రంలో 600 మంది ఎస్సీ, ఎస్టీ రైతులకు పాలీహౌస్ వ్యవసాయంలో నూటికి నూరుశాతం సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించారు. సూక్ష్మ సేద్యాన్ని ప్రోత్సహించేందుకు అన్ని సామాజిక వర్గాల రైతులకు సబ్సిడీ పరిమితిని ఒక హెక్టార్ నుంచి ఐదు హెక్టార్ల వరకు పెంచారు. గరిష్ఠ సబ్సిడీపై ఉన్న కుటుంబానికి లక్ష రూపాయల పరిమితిని సడలించారు. పండ్లు, కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం హార్టికల్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పి పసుపు, కారం, అల్లం లాంటి సరుకులను కూడా నాణ్యమైనవిగా ప్రజలకు అందించాలని నిర్ణయించారు.
మార్కెటింగ్ శాఖ రాష్ట్రంలోని 330 చోట్ల గిడ్డంగుల నిర్మాణాన్ని చేపట్టారు. 17.075 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని నిల్వచేయవచ్చు. నాబార్డు రుణ సహాయంతో చేయనున్న ఈ గిడ్డంగుల నిర్మాణపు అంచనా వ్యయం రూ. 1024.50 కోట్లు.
విద్యుత్ రంగంలో తొలగిన చీకట్లు
రాష్ట్రంలో వచ్చే మూడేళ్లలో 23,912 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరగాలనే లక్ష్యంతో ప్రభుత్వం కొత్త విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లు మంత్రి ఈటల పేర్కొన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి రాష్ట్రంలో వ్యవసాయానికి ఉచితంగా 9 గంటల విద్యుత్ సరఫరా చేస్తామన్నారు. ఆరువేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు బిహెచ్‌ఇఎల్‌తో ఒప్పందం ఖరారు చేశారు. 680 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్రాజెక్టులు ఇప్పటికే పూర్తయ్యాయి. 2017-18 నాటికి ఐదు వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పాదన లక్ష్యంగా పెట్టుకున్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలనుకునే వారికి సింగిల్ విండో కింద అన్ని అనుమతులు ఒకే చోట ఇస్తారు. విభజన చట్ట ప్రకారం విద్యుత్ ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కుట్ర చేసిందని, ఈ పరిస్థితి నుంచి రాష్ట్రం చాలా తొందరగా తేరుకుని కోతల్లేని విద్యుత్‌ను అందిస్తున్నట్లు చెప్పారు. రూ.91,500 కోట్ల పెట్టుబడితో జెన్కో, సింగరేణి కాలరీస్, ఎన్టీపిసి, సోలార్ యూనిట్ల ద్వారా లక్ష్యాన్ని నెరవేరుస్తున్నట్లు పేర్కొన్నారు.