అంతర్జాతీయం

ఐసిస్‌ను నాశనం చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమెరికా ప్రజలకు ఒబామా అభయం
వాషింగ్టన్, డిసెంబర్ 7: కాలిఫోర్నియాలో కాల్పుల ఘటనతో వణికిపోతున్న అమెరికా ప్రజలకు ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభయమిచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా పెను సవాళ్లు విసురుతున్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) ఉగ్రవాద గ్రూపున సర్వనాశనం చేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. అమెరికాతో పాటు వివిధ దేశాల్లో ప్రజల ఆలోచనలను ‘విషపూరితం’ చేస్తున్న ఉగ్రవాదం ‘సరికొత్త దశ’కు చేరుకుందని, అయినా ఈ ముప్పును అమెరికా సమర్థవంతంగా అధిగమించగలదని ఆయన ప్రకటించారు. అమెరికా అధ్యక్ష భవనం ‘వైట్ హౌస్’లోని ఓవల్ కార్యాలయం నుంచి ఆయన సోమవారం జాతిని ఉద్దేశించి చేసిన అరుదైన ప్రసంగంలో ఈ విషయాలను స్పష్టం చేశారు. అమెరికాతో పాటు ప్రపంచంలోని చాలా దేశాలు ఉగ్రవాద ముప్పును ఎదుర్కొంటున్న మాట నిజమేనని, అయినా దీనిని అమెరికా అధిగమించగలదని ఒబామా పేర్కొన్నారు. అయితే సిరియా, ఇరాక్‌లను కేంద్రంగా చేసుకుని మారణహోమాలకు తెగబడుతున్న ఐసిస్ నరహంతక మూకలను ఓడించేందుకు భారీమొత్తంలో సాయుధ బలగాలను తరలించే విషయాన్ని ఆయన తోసిపుచ్చారు. ఐసిస్ ఉగ్రవాద సంస్థను నాశనం చేసేందుకు వ్యూహం సిద్ధమైందని, అమెరికా సైనిక కమాండర్లు, తీవ్రవాద నిరోధక విభాగానికి చెందిన నిపుణులు రూపొందించిన ఈ వ్యూహాన్ని ఐసిస్‌కు వ్యతిరేకంగా అమెరికా నేతృత్వంలో పనిచేస్తున్న సంకీర్ణ కూటమిలోని 65 దేశాలు బలపరిచాయని ఒబామా తెలిపారు. ‘ఐఎస్‌ఐఎల్ (ఐసిస్ ఉగ్రవాద సంస్థకు ఇది మరో పేరు)తో పాటు అమెరికాకు హాని తలపెట్టాలని ప్రయత్నించే ఎటువంటి ఉగ్రవాద సంస్థనైనా సర్వనాశనం చేస్తాం’ అని ఆయన తేల్చిచెప్పారు.