రాష్ట్రీయం

హాట్సాఫ్ ఇస్రో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దూసుకెళ్లిన ‘సాస్’ ఉపగ్రహం
కమ్యూనికేషన్ రంగంలో దక్షిణాసియా
దేశాలకు మరింత బలం
క్రయోజనిక్ ప్రయోగాల్లో మరో రికార్డు
జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 ప్రయోగం దిగ్విజయం

సూళ్లూరుపేట, మే 5: రోదసీ పరిశోధనలో ఇస్రో మరో రికార్డు సృష్టించింది. అంతరిక్ష ప్రయోగాల వినీలాకాశాలంలో భారత త్రివర్ణ పతాకం మరోమారు రెపరెపలాడింది. స్వదేశీ క్రయోజనిక్‌తో మరోసారి మన శాస్తవ్రేత్తలు సత్తాచాటారు. ఇస్రో కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరింది. అంతరిక్షంలో భారత్ మరోమైలురాయిని అధిగమించింది. దక్షిణాసియా దేశాల సమాచార వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రధాని కలల సాకారాన్ని మన శాస్తవ్రేత్తలు నిజం చేశారు. దీంతో సార్క్ దేశాలకు మైత్రీ బంధం మరింత బలపడింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ( ఇస్రో) కదనాశ్వం జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 ప్రయోగం మరోసారి విజయబావుటా ఎగరవేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించి ప్రయోగించిన సౌత్ ఏసియా శాటిలైట్ (సాస్) జీశాట్-9 ఉపగ్రహాన్ని జిఎస్‌ఎల్‌వి వాహక నౌక విజయవతంగా నింగిలోకి మోసుకెళ్లింది. దీంతో క్రయోజనిక్ ప్రయోగాల్లో ఇస్రో నాలుగోసారి వరుసగా విజయం సాధించడమే కాకుండా శాస్తవ్రేత్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ ప్రయోగం కోసం నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్)లో గురువారం ఉదయం 12గంటల 57నిమిషాలకు ప్రారంభమైన కౌంట్‌డౌన్ 28గంటలు నిరాటకంగా కొనసాగింది. ఆ తరువాత శుక్రవారం సాయంత్రం సరిగ్గా 4గంటల 57నిమిషాలకు షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుడి జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 09 రాకెట్ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. కొంతసేపు ఉత్కంఠ నెలకొన్నా స్వదేశీ క్రయోజనిక్ ప్రయోగాల్లో జిస్‌ఎల్‌వి మరో విజయాన్ని నమోదు చేసింది. జిఎస్‌ఎల్‌వి వాహక నౌక జీశాట్-9 ఉపగ్రహాన్ని 20నిమిషాల్లో నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఈ రాకెట్ ద్వారా సాస్ ఉపగ్రహాన్ని 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఈ విజయంతో ఇస్రో కీర్తి ప్రతిష్టలు ఇతర దేశాలకు పాకాయి. ప్రధాని నరేంద్ర మోదీ కోరిక మేరకు దక్షిణాసియా దేశాలల్లో సమాచార వ్యవస్థను మెరుగుపరిచి సాకారం అందించేందుకు ఇస్రో శాస్తవ్రేత్తలు కమ్యూనికేషన్ రంగానికి చెందిన ఉపగ్రహాన్ని రూపకల్పన చేసి ప్రయోగించారు. ఈ విజయంతో దక్షిణాసియాలోని ఏడు దేశాలకు లబ్ధి పొందనున్నాయి. దీని సేవలు 12సంవత్సరాలు పాటు అందుతాయి. ఇందులో 12కెయూ బ్రాండ్ ట్రాన్స్‌ఫాండర్లను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, భూటాన్, నేపాల్, బంగ్లాదేశ్, మాల్దివులులతో పాటు మన దేశం సేవలు అందనున్నాయి. ఆయా దేశాల అవసరాల మేరకు దీని సేవలు ఉపయోగించుకోవచ్చును. ఈ ప్రయోగంతో సార్క్ దేశాలల్లో సమాచార వ్యవస్థ మరింత బలపడనుంది. పొరుగుకు పెద్దపీట విదేశీ విధానంలో భాగంగా జీశాట్-9 ప్రయోగాన్ని ఇస్రో తొలిసారిగా ప్రయోగించింది. అంతేకాకండా ఇస్రో తొలిసారిగా ఉపగ్రహంలో విద్యుత్ చోదక వ్యవస్థను వినియోగించింది. తద్వారా రసాయనిక ఇంధనాన్ని తగ్గించి ఉపకరణాలను పెంచుకొనే వీలుంటుంది. జిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఇది 11వ ప్రయోగం కావడం వివేషం. ఈ ఏడాది వరుసగా రెండో ప్రయోగం విజయం కాగా జిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో వరుసగా మూడో ప్రయోగం విజయవంతం కావడం విశేషం. జిఎస్‌ఎల్‌వి ప్రయోగాల్లో ఎంతో సంక్లిష్టమైన క్రయోజనిక్ దశను స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో మన శాస్తవ్రేత్తలు రూపకల్పన చేసి విజయం సాధిస్తున్నారు. ఈ ప్రయోగ విజయంతో ప్రపంచ దేశాలు సైతం భారత్ వైపు చూస్తున్నాయి. అంతకాకుండా మునుముంద భారీ రాకెట్ ప్రయోగాలకు మార్గం సుగమమం అయ్యింది. ఈ ప్రయోగాన్ని 20మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ కమిటి షార్‌కు చేరుకొని ప్రత్యక్షంగా వీక్షించారు. మరోవైపు ఈ ప్రయోగానికి మీడియాను దూరంగా ఉంచారు.

పొరుగు దేశాలకు ఇది అమూల్యమైన కానుక.
సహకారంపై హామీని
నిలబెట్టుకున్నాం. మనకు
ఆకాశమూ హద్దు కాదు