జాతీయ వార్తలు

చంద్రయాన్-2 కీలకఘట్టం విజయవంతం:శివన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు: చంద్రయాన్-2లో కీలకఘట్టం ఈరోజు విజయవంతమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. ఆయన ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఇకపై జరుగబోయే ఘట్టాలను ఆయన సాంకేతిక అంశాలు జోడించి వివరించారు. వచ్చేనెల 7వ తేదీన తెల్లవారు జామున జాబిల్లి పైకి చేరుకుంటుందని ఆయన తెలిపారు. ఈరోజు చంద్రయాన్-2 కీలక ఘట్టం విజయవంతంగా పూర్తిచేశామని, చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టే ఘట్టం విజయవంతమైందని అన్నారు. ఈ పక్రియ ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమై 30 నిమిషాలు పాటు కొనసాగిందని తెలిపారు. జూలై 22న ప్రారంభించిన తరువాత ఇప్పటి వరకు ఐదు విన్యాసాలు పూర్తిచేశామని, వీటిల్లో ఆగస్టు 14న చేపట్టిన ట్రాన్స్‌ల్యూనర్ ప్రక్రియ అత్యంత ప్రముఖమైందని తెలిపారు.