జాతీయ వార్తలు

జెఎన్‌యు విద్యార్థి సంఘం నేత అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: పార్లమెంటుపై దాడి చేసిన కేసులో అఫ్జల్ గురును ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తూ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యు)లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించిన కేసుకు సంబంధించి పోలీసులు జెఎన్‌యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయా కుమార్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి కన్హయా కుమార్‌ను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. మామూలు దుస్తుల్లో ఉన్న ఇద్దరు పోలీసులు జెఎన్‌యు క్యాంపస్‌కు వచ్చి ప్రశ్నించడం కోసం కుమార్‌ను తీసుకెళ్లారని, ఆ తర్వాత ఆయనను అరెస్టు చేశారని సంబంధిత వర్గాలు తెలియజేశాయి. అనంతరం ఆయనను స్థానిక కోర్టులో హజరుపరచగా, కోర్టు మూడు రోజులు పోలీసు కస్టడీకి అప్పగించింది.
కాగా కుమార్ అరెస్టుపై యూనివర్శిటీ విద్యార్థులు, అధ్యాపకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విద్యార్థులను ఉగ్రవాదులుగా చూస్తున్నారని, మామూలు దుస్తుల్లో ఉన్న పోలీసులు విద్యార్థులను క్యాంపస్‌లోంచి తీసుకెళ్తున్నారని వారంటూ, ఈ విషయంలో యూనివర్శిటీ యంత్రాంగం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తూ వర్శిటీ వైస్‌చాన్సలర్ కార్యాలయం ముందు నిరసనకు దిగారు. ఈ సంఘటనలను ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తలపిస్తున్నాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ‘నినాదాలు ఎవరు చేశారో మీకు తెలుసా? అన్నది ప్రశ్న. తెలిస్తే వారిపై చట్టప్రకారం చర్య తీసుకోండి. వారెవరో తెలియనప్పుడు విద్యార్థి నాయకులందిరనీ ఎలా అరెస్ట చేస్తారు?’ అని ఏచూరి ప్రశ్నించారు. మగ పోలీసులు విద్యార్థినుల హాస్టళ్లకు వెళ్లి అరెస్టులు జరుపుతున్నారు. ఎమర్జెన్సీలో మాత్రమే మనం ఇలాంటివి జరగడం చూసాం. మళ్లీ ఇప్పుడు బిజెపి వాళ్లు దేశ ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు’ అని ఆయన అన్నారు. విద్యార్థులపై దేశద్రోహం కేసు నమోదు చేయడాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ సైతం ప్రశ్నిస్తూ, ఇది చాలా తీవ్రమైన అభియోగం అని, దీనికింద చర్య తీసుకునే ముందు ప్రభుత్వం ఒకటికి రెండు సార్లు ఆలోచించాలన్నారు. కాగా, యూనివర్శిటీ క్యాంపస్‌లో స్వేచ్ఛగా చర్చ జరపడానికి వర్సిటీలోని విద్యార్థులకు, అధ్యాపకులకు హక్కు ఉందని, అయితే, రాజ్యాంగాన్ని, ఈ దేశ చట్టాలను ఉల్లంఘించే చర్యలకు వర్శిటీని వేదిక చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జెఎన్‌యు కొత్త వైస్ చాన్సలర్ జగదీశ్ కుమార్ చెప్పారు.