తెలంగాణ

జాతరకు నిండుశోభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడారం, ఫిబ్రవరి 19: బుధవారం ఏకకాలంలో ముగ్గురు దేవతలు గద్దెలపైకి చేరడంతో మేడారం జాతరకు నిండుశోభ సంతరించుకుంది. కనె్నపల్లి నుండి సారలమ్మ..కొత్తగూడ మండలం పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు.. ఏటూరునాగారం మండలం కొండాయి నుండి గోవిందరాజులు గద్దెలపైకి చేరగా గురువారం రాత్రి చిలకలగుట్ట నుండి సమ్మక్కతల్లి రాకతో మేడారం జాతర మురిసిపోయింది. తల్లులు గద్దెలపైకి చేరడంతో మేడారం అమ్మల ప్రభతో ప్రకాశవంతంగా మారింది. అమ్మలిద్దరు గద్దెలపై ఉండటంతో శుక్రవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా..తల్లుల దర్శనభాగ్యం ఉంటేచాలు.. అనుకొని మూడు రోజులపాటు మేడారంలో విడిదిచేసి తల్లుల దర్శనం కోసం పరితపించిన భక్తులు శుక్రవారం తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. తల్లులను వేడుకొంటే తమ కష్టాలు తీరతాయని..కోరిన కోర్కెలు తీరతాయనే ప్రగాఢ విశ్వాసం భక్తులలో నెలకొని ఉంది. ఈ నమ్మకమే భక్తులను మేడారం బాట పట్టిస్తుంది. భక్తుల అచెంచల నమ్మకాన్ని నిజం చేస్తున్న తల్లులు ఇప్పటికే కోట్లాది మంది భక్తులకు ఇలవేల్పుగా మారారు. పుట్టువెంట్రుకల నుండి..నిలువెత్తు బంగారం వరకూ.. రూపాయి నుండి ... డాలర్ల వరకూ తల్లులకు సమర్పించేందుకు భక్తులు ప్రతి జాతరలో సిద్దమవుతారు. ఈ క్రమంలోనే ప్రతి మేడారం జాతరలో ఆదాయం ఘననీయంగా పెరుగుతూ వస్తుంది. ప్రతిసారి జరిగే మేడారం జాతరకు పెరుగుతున్న భక్త జనుల సంఖ్య తల్లుల మహిమలకు నిదర్శనంగా నిలుస్తుంది. అన్నిశాఖల అధికార యంత్రాంగం మేడారంలోనే మకాం వేసి భక్తుల సౌకర్యాలపట్ల అత్యంత శ్రద్దతో ఏర్పాట్లను చేపట్టారు. ఇప్పటి వరకూ రెండు లక్షల ప్రయివేటు వాహనాలలో భక్తులు మేడారం తరలివచ్చినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మహాజాతర నేపథ్యంలో పోలీసులు 10వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేసారు. ఆర్టీసి 4వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది.