డైలీ సీరియల్

వ్యూహం 34

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రశాంతంగా వుండాలి పరిసరాలు.. అదే అతను కోరుకునేది.
లోపలికి వచ్చిన ఇద్దరిలో ఒకడు భుజనాకి తగిలించుకున్న బ్యాగులో నుంచి పొడుగాటి కత్తి తీసి శరణ్‌మీదకు దూకేడు.
జరగబోతున్న ఉపద్రవం గ్రహించాడు శేషగిరి.
పరుగున వెళ్లి శరణ్‌కు అడ్డంగా నిలబడ్డాడు.
బలంగా పడిన కత్తివేటుకు అతని ఎడం చెయ్యి తెగి కిందపడిపోయింది.
వంటింట్లోనుంచి వచ్చిన అన్నపూర్ణమ్మ ఆ దృశ్యం చూసి పెద్దగా కేకలు పెట్టింది.
రౌడీలు ఇద్దరూ పారిపోయారు.
రక్తం కాలువలా ప్రవహిస్తూ వుంది.
శేషగిరిని హాస్పిటల్లో చేర్పించారు.
‘‘ఏమిటండీ? మీకు ఇలా జరిగింది?’’
‘‘అన్నీ మన మంచికే! శరణ్‌కు ఏ ఆపదా రాలేదు, నా ప్రాణం పోలేదు. చెయ్యి మాత్రమే పోయింది.. భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. కోలుకున్నాక తలనీలాలు ఇస్తాను.. నా తల తెగలేదు, సంతోషించు!’’ అన్నాడు చిరునవ్వును చెదిరిపోనివ్వకుండా.
****
ఆఫీసు రూములో కూర్చుని ‘గుడ్ సమారిటన్’ హాస్పిటల్ ఫైలు తిరగేస్తూ వున్నాడు స్కంద.
హైస్కూల్లో చదివే రోజుల్లో ‘గుడ్ సమారిటన్’ కథ చదివాడు. సమారిటన్ నలుగురికి సహయం చేసే వ్యక్తి. మంచి గంధంచెక్కలా తాను అరిగిపోతూ నలుగురికి సువాసనలు అందిస్తూ వుంటాడు. తన స్వార్థం చూసుకోకుండా ఇతరులకు సహాయపడటమే అతని దినచర్య. ఆపదలో వున్నవాళ్ళు సమారిటన్‌ను తలుచుకోగానే అక్కడ ప్రత్యక్షమవుతాడు.
హాస్పిటల్‌కు అంత మంచి పేరు పెట్టుకుని అరిఫ్ ముఠా నిరుపేద రోగులను మోసం చేస్తూ వుంది. కిడ్నీ రాకెట్ నడిపిస్తూ వున్నాడు అరిఫ్ మనుషులు.
నలభైయ్యేళ్ళు వున్న వ్యక్తిని తీసుకువచ్చింది లోహిత.
‘‘రిస్క్ తీసుకుని టాస్క్ఫోర్స్ కార్యాలయానికి వస్తున్నారు. అరిఫ్ మనుషులు మమ్మల్ని గమనిస్తే ప్రాణాలతో వుండనివ్వరు’’ అన్నాడు స్కంద.
‘‘నా ప్రాణాలు అంత ముఖ్యం కాదు.. దేశంలో నకిలీ నోట్లు చెలామణి చేస్తూ మాదకద్రవ్యాలు అమ్ముతూ, నిరుపేదల అవయవాలను కారుచౌకగా కొనేస్తూ దేశం ప్రాణాలు తోడేస్తున్నారు దేశద్రోహులు. వాళ్ళ ఆట కట్టించాలి’’ అంది డాక్టర్ లోహిత ఆవేశపడుతూ.
‘‘ఈ స్పిరిట్‌తో పనిచేస్తే మనం అనుకున్నది సాధిస్తాం! నీ రాకపోకలను వాళ్ళు గమనిస్తూనే వుంటారు.. జాగ్రత్తగా ఉండాలి’’ అన్నాడతను.
‘‘బురఖా వేసుకుని బయటకు వస్తున్నాను గదా! ననె్నవరు గమనించరు!’’ అందామె.
‘‘వీరెవరు?’’ అడిగాడు లోహిత వెంటబెట్టుకుని తీసుకువచ్చిన వ్యక్తివైపు చూస్తూ.
‘‘ఇతని పేరు కోటయ్య.. స్వగ్రామం కర్లపాలెం.. ఇతన్ని మోసం చేశారు. జరిగిందేదో వివరంగా చెప్పండి’’ అంది లోహిత కోటయ్య వైపు తిరిగి.
‘‘బాబూ! నేను వ్యవసాయం చేస్తూ వుంటాను.. ఖరీఫ్ పంట పండించడానికి డబ్బు అవసరమైంది. బ్యాంకులో ఇంతకుముందే వ్వయసాయ రుణం తీసుకున్నాను. ఆ రుణం చెల్లిస్తే కొత్తగా రుణాలు ఇవ్వమని బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. బ్యాంకులోనుంచి బయటకు వస్తుంటే అనాజ్ కన్పించాడు. వాడు మా ఊరి వాడే! నేను చెప్పినట్లు చెయ్యి.. నీకు రెండు లక్షలు నీ చేతిలో పడేటట్లు చేస్తాను అన్నాడు. వాడి మాటలు నమ్మి మా ఆవిడ చంద్రికను ఆసుపత్రికి తీసుకువెళ్ళను. కసాయివాడిని గొర్రె నమ్మినట్లు నా వెనుకే వచ్చింది.. ఆపరేషన్ చేశారు... ఆపరేషన్ అయ్యేక 50 వేలు చేతిలో వుంచాడు అనాజ్.. అదేమిటి? రెండు లక్షలు ఇప్పిస్తానన్నావు గదా! అని అడిగితే ‘‘యాభై వేలు ఎక్కువ.. మరీ ఎక్కువ మాట్లాడితే చంపేస్తాను’’ అని బెదిరించాడు బాబూ, అన్నాడతను.
‘‘హాస్పిటల్లో దగ్గరి బంధువుల కిడ్నీని తీసి రోగికి అమర్చుతూ వుంటారు. మరి ఇంత తేలిగ్గా ఎవరికి పట్టుబడకుండా ఎలా చేస్తున్నారు ఆపరేషన్స్?’’ అడిగింది లోహిత.
నవ్వాడు స్కంద లోహిత వైపు చూస్తూ.
‘‘చట్టప్రకారం భార్య కిడ్నీ భర్తకు అమర్చవచ్చు.. భార్య తన కిడ్నీని భర్తకు దానం ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేకపోవటంతో శస్త్ర చికిత్స ఆటంకాలు లేకుండా జరిగిపోయింది’’.
‘‘కోటయ్యకు అతని భార్య కిడ్నీ అమర్చలేదు గదా! మరొకరికి గదా ఆమె కిడ్నీని అమర్చింది!’
‘‘జరుగుతున్న కుంభకోణం ఇదే! చంద్రిక తన భార్య అని నిరూపించే ఓటరు కార్డు, నోటరీ ధ్రువీకరించిన ప్రమాణ పత్రం, తాశీల్దారు జారీ చేసిన రెసిడెన్షియల్ సర్ట్ఫికెట్ మీ రికార్డుల్లో ఉంటాయి. ఆపరేషన్ చేయించున్న వ్యక్తి చంద్రిక తన భార్య అని చెప్పి ఆమె కిడ్నీని స్వీకరిస్తాడు.. నిజానికి కిడ్నీ ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి సమర్పించే ధృవపత్రాలన్నీ నకిలీవే! చట్టపరమైన వెసులుబాటు కోసం రోగి సమీప బంధువుగా దొంగ ధ్రువపత్రం సృష్టిస్తారు!

ఇంకాఉంది

అలపర్తి రామకృష్ణ