వినదగు!

ప్రేమ విస్తరించాలి.. భౌతికం కరగాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రార్జునుడు కృష్ణుడితో మాట్లాడినట్లు మనమూ ఆ కృష్ణుడితో మాట్లాడగలమంటారా?’ చైతన్య ప్రశ్న.
‘కృష్ణుడనే కాదు, వ్యాస వాల్మీకులే కాదు.. యోగ ప్రజ్ఞకు ప్రతీకలైన ఏ మహాత్ములతోనైనా, భౌతికంగా లేకపోయినా, కాలాతీతంగా మాట్లాడవచ్చు... యోగ ప్రజ్ఞతో ‘ఒన్‌నెస్’ సాధ్యమైననాడు. ఒన్‌నెస్ అంటే పర అపర కలిసిపోవటం.. ఒకే చైతన్యంగా పరిణమించటం.. భిన్నం అభిన్నం అయి ఏకం కావటం.. ఈ ఏకత్వమే ఈ సంయోగమే యోగం.
యోగ భూమికలలో నిన్న, నేడు, రేపులు ఉండవు... కాలరేఖ పైన భూత, భవిష్య, వర్తమాన విభజన లేదు.. కాబట్టి, నిన్నటి వారైనా, రేపటి వారైనా, నేటి వారైనా యోగ ప్రజ్ఞ కలవారిని పలకరిస్తుంటారు. వారి రూపాలు కాకపోయినా వారి తత్వాలు మనల్ని పలకరిస్తుంటాయి. ఆ తత్వ సమన్వయంతో వారి రూపాల్ని మన కళ్ల ముందుకు తెచ్చుకుంటాం. అందుకే వారివి ఫిజికల్ బాడీస్‌లా అనిపించే ఈథరిక్ బాడీస్.
యోగ సాధనతో మన ఈ పాంచభౌతిక దేహం నుండి ఈథర్ బాడీ తయారు కావటానికి మన అహం పూర్తిగా కరిగిపోవాలి. ఇక్కడ అహం అంటే నా తనం కాని ఫాల్స్ ప్రిస్టేజ్. ప్రేమ ఎల్లలు దాటాలి. ప్రేమించటానికి ఏ హద్దులూ అడ్డుగోడలు కాకూడదు... మనం ధ్యాన జగత్తులో మొదటగా సాధించేది ఈ ఎల్లలు లేని ప్రేమ తత్వానే్న. ప్రేమ విస్తరిస్తున్న కొద్దీ మన భౌతికం కరుగుతుంటుంది. ఈథరిక్ బాడీ శక్తిని పుంజుకో నారంభిస్తుంది.
ఈ శక్తిచాలనానికి ఉపకరించే మార్గాలే ధ్యాన మార్గమైనా, భక్తి మార్గమైనా, జ్ఞాన మార్గమైనా, కర్మ మార్గమైనా, సేవా మార్గమైనా. మన ప్రేమే సంకల్పంగా పరిణమించటం ముఖ్యం. అంటే యోగ సాధనతో మన ప్రేమ విశ్వజనీనం కావాలి.’
‘గురువుగారూ! ఒక చిన్న సందేహం. మన ప్రేమ విస్తృతం కావటం అంటే గికంగా అనాహత చక్ర ప్రజ్ఞ పరిఢవిల్లటవే కదా?!’ చైతన్య.
‘అవును చైతన్యా! అనాహత ప్రజ్ఞ అంటే మన హృదయం ప్రేమతో పవిత్రం కావటం.. పరిశుద్ధం కావటం.. పారదర్శకం కావటం.. విశ్వంలోని భిన్నతలను పొదువుకోవటం.. ద్వైధీభావన లేకపోవటం. అందుకే అనాహతాన్ని పచ్చదనానికి ప్రతీక చేశారు. దేన్నీ ద్వేషించక పోవటం, దేన్నీ బాధించక పోవటం ఈ అనాహత చక్ర ప్రజ్ఞ పరిక్రమించటానికి సంకేతం.
అంతస్సౌందర్యం విప్పారేది ఈ చక్ర శక్తి చాలనంతోనే. ఇంకా చెప్పుకోవాలంటే భౌతిక జీవనానికి, అధిభౌతిక జీవనానికి వారథి ఈ అనాహతమే. అంటే, అనాహత ప్రజ్ఞతోనే మనం భౌతికం నుండి అధిభౌతికానికి ప్రయాణిస్తాం.. అధిభౌతికంగా పరిణమిస్తాం. ఒక విధంగా ఈ అనాహత ప్రజ్ఞ అనేది గిక ప్రజ్ఞలో తొలి అంకం అనకోవచ్చు.
ఇకపోతే, అనాహత స్థానం శుద్ధ స్థానం అయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్నిరోధంగా మనం విశుద్ధాన్ని చేరగలం.. అంటే మన గిక పరిణావం మరో అంతస్థును, అంతస్సును చేరుకుంటుంది. అలా కాక మనలో ఈర్ష్య, అసూయ, ద్వేష భావాలు ఇంకా పొటమరిస్తున్నాయంటే ఇంకా మనం శుద్ధం కానట్లే! మన అనాహత స్థానం మరింతగా ప్రేమను పండించే స్థితికి చేరుకోనట్లే!!
కౌరవాధిపతి దుర్యోధనుడి అనాహతం పరిశుద్ధం కాకపోవటం వల్లనే ఈర్య, అసూయలు కురుక్షేత్ర సంగ్రామ బాట పడ్డాయి. దుర్యోధనుడి యోగ ప్రజ్ఞ భౌతికాన్ని దాటలేక పోయింది. అయితే, అర్జునుడు కురుక్షేత్రం వరకు వచ్చి యుద్ధం చేయబోతూ ప్రేమతో పరితపించాడు... విచక్షణాశీలి అయ్యాడు. కాబట్టే అర్జునుడి అనాహతం నిర్నిరోధం కావటానికి భగవద్గీతను బ్రహ్మాస్త్రం చేసుకున్నాడు కృష్ణుడు. అర్జునుడి భౌతిక ప్రజ్ఞను అధిభౌతిక ప్రజ్ఞగా పరిణమింపజేశాడు. అందుకే కృష్ణ గీత ‘గిక గీత’ అరుంది.’ నా విశే్లషణ.
‘ఎక్సలెంట్ గురువుగారూ’ చైతన్య.
‘అన్నట్టు చైతన్యా! అనాహతానిది వాయుతత్వం. అంటే గికంగా ఈథరిక్ లెవల్‌కి తొలి ప్రాంగణం అనాహతం.. హృదయక్షేత్రం. మన యోగ సాధనా ఫలితమైన యోగ ప్రజ్ఞ భౌతికం నుండి అధిభౌతికంగా పరిణమించే ప్రక్రియలో మన సూక్ష్మ శరీరం ఈథర్ బాడీగా పరిణమించటం తొలి ప్రవేశిక. కాబట్టి, అనాహత శక్తి చాలనమైన వాయు తత్వమంతం ఈ ఈథరే. అందుకే గిక క్రియలో శ్వాస మందగించటం, శూన్యం కావటం అంటే స్పేస్‌లో ఈథర్‌గా మారటం జరుగుతుంది.
ఇక, యోగ సాధనలో మన అహం కరుగుతోందంటే అనాహతంలో శక్తిచాలనం జరుగుతున్నట్లే.. మనం వైయక్తికంగా అహం నుండి తొలగుతున్నట్లే.. భౌతికంగా డిటాచ్‌మెంట్ అనేది సాధ్యమవుతున్నా, మరోవైపు బలపడుతున్న బాంధవ్యాలన్నీ ప్రేమ వికసిత, అర్థవంత గిక బంధాలగా పరిణమిస్తుంటాయి. మొత్తానికి మన ‘ఓపెన్‌నెస్ నుండి ఒన్‌నెస్’ని సాధించటానికి ఈ అనాహతమే ప్రేరకమవుతుంది.’
‘మీ వివరణనుబట్టి సామాన్యంగా ప్రతి ఒక్కరూ షట్చక్రాల విషయంలో పతంజలి యోగ సూత్ర విజ్ఞానానికే పరిమితమై పోతున్నారనిపిస్తోంది’ చైతన్య.
‘అవును చైతన్యా! పతంజలిని మనం హఠయోగానికే పరిమితం చేస్తుండటం వల్ల వస్తున్న చిక్కు ఇది. అసలు పతంజలిని అష్టాంగ యోగ సూత్రాలకే కుదించి అష్టదిగ్బంధనం చేస్తూ యోగ పరిధిని సైతం కుదిస్తున్నాం.. మన యోగావిజన్, సంకుచితం చేసుకుంటున్నాం. పతంజలి యోగ మార్గమైనా, మరో అధునాతన యోగ మార్గమైనా ఎప్పటికప్పుడు విస్తృతమవుతుండాలి.’
‘అదెలా సాధ్యం గురువుగారూ! ఒకరు ఒక మార్గాన్ని నిర్వచించిన తర్వాత దాని పరిధి అక్కడికే పరిమితం కాదా?’ చైతన్య డౌట్.
‘నా దృష్టిలో విస్తృతం కావటం అంటే ఆయా యోగ మార్గాలను మరింత అర్థవంతం చేసుకోవటం.. మనం భౌతికంగా మన కుటుంబ వ్యవస్థలో బంధుత్వాలను కలుపుకుంటూ విస్తృతం చేసుకోవటం లేదూ... అలాగే యోగపరంగాను ఇతర యోగ మార్గాలతో అనుసంధానం కావాలి. ఈ అంశాన్ని భగవద్గీత చాల చక్కగా చెప్పక చెప్పింది.
కృష్ణుడు కొంత తడవు భక్తి మార్గం గురించి చెప్పాడు.. ఇంకొంత తడవు జ్ఞాన మార్గం గురించి చెప్పాడు.. మరి కొంత తడవు కర్మమార్గం గురించి చెప్పాడు. అన్నింటిని యోగానికి శాఖలను చేశాడు. ఏదో ఒక కొమ్మను పట్టుకుని ఇదే చెట్టు అని చెప్పలేం.. మొదట్లో కనిపించే కొమ్మనే మనల్ని సాదరంగా ఆహ్వానిస్తుంది.
ఆ కొమ్మను చేరుకున్నాక మరో కొమ్మను చేరుకోవటానికి ఊతం లభిస్తుంది. ఇక్కడా అంతే...

- డా. వాసిలి వసంతకుమార్ 9393933946