మెయన్ ఫీచర్

విద్యాలయాలా? వివాదాలకు నెలవులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మళ్ళీ దళిత రాజకీయం తెలంగాణ రాజధాని హైద్రాబాద్ నడిబొడ్డున జడలు విప్పింది. హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలో పి.హెచ్.డి. చేస్తున్న వేముల రోహిత్ ఆత్మహత్యతో రాజకీయ పక్షాలన్నీ ఏకం అయ్యాయి. కొందరు అతన్ని అంబేద్కరిస్టు అన్నారు. కొందరు దళితుడన్నారు. కొందరు అతనితో తీవ్రవాదానికి జైకొట్టించారు. అతను ఉరివేసుకున్న తరువాత ఎర్రజెండాలతో ధర్నాలు చేస్తున్నారు.
రాజ్యాంగబద్ధంగా తీవ్రవాది యాకుబ్ మెమెన్‌ను ఉరితీయాలని సుప్రీంకోర్టు తీర్పు చెబితే, అందుకు వ్యతిరేకంగా ప్రదర్శన జరిపిన సోకాల్డు కుహనా లౌకికవాదులు రోహిత్‌లో దేశ వ్యతిరేక భావాలు నింపి అతన్ని ఉసిగొల్పారు. అతని మనోబలాన్ని సిద్ధాంత రాద్ధాంతంతో దెబ్బతీశారు. ఈ ప్రదర్శనను వ్యతిరేకించిన జాతీయవాదులపై దాడి చేయించారు. కేంద్ర మంత్రి శ్రీ దత్తాత్రేయ ఈ విషయమై మానవ వనరుల అభివృద్ధిశాకు లేఖ రాస్తే ఆయనపై ఎస్‌సి అట్రాసిటీ కేసుపెట్టారు. రోహిత్‌ను పావుగా వాడుకుని దళిత రాజకీయం పబ్బం గడుపుకునేందుకు అంతా పరుగుపరుగున హైద్రాబాద్ చేరుకున్నారు. హైద్రాబాద్‌లో ఎన్నికలు జరుగుతున్న తరుణంలో మరోసారి జాతీయవాదులపై బురదజల్లే వ్యూహాలకు పదునుపెడ్తున్నారు. తన చావుకు ఎవరూ కారణంకాదని రోహిత్ తన స్యూసైడ్ నోట్‌లో వ్రాసినప్పటికీ సోకాల్డు దళిత బాంధవులు చెలరేగిపోయారు. దేశభక్త సైనికులైన కల్నల్ సంతోష్ మహదిక్, కల్నల్ నిరంజన్‌ల అంత్యక్రియలకు హాజరుకాని, పఠాన్‌కోట్ మృతవీరుల కుటుంబాలు పరామర్శించని రాహుల్‌గాంధీ పరుపరుగున హైద్రాబాద్ చేరుకున్నారు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ పేర వామపక్ష భావజాలంతో రెచ్చిపోతున్న విద్యార్థి నేతలు యాకూబ్‌మెమెన్ ఒకరు చనిపోతే వంద మంది పుడతారని ఆగస్టు 2న నమాజు చేయడం నిజంగా అంబేడ్కర్ బతికుంటే హర్షించే విషయమేనా? విద్యాలయాల్లో ‘దేశద్రోహం’ వల్లెవేస్తున్న ఈ తరహా విద్యార్థులను, తమ చర్యలను వ్యతిరేకిస్తున్న విద్యార్థులపై దాడిచేస్తున్న ఈ హింసావాదులను విశ్వవిద్యాలయం బహిష్కరించడం నేరమా? మరిక విద్యావిధానాని క్రమశిక్షణ, అనుశాసనం అక్కరలేని విషయాలవుతున్నాయా? విద్య పేర, ఆరక్షణ పేర సీట్లు సంపాదించుకుని తమ యిష్టానుసారం వ్యవహరిస్తూ అంబేద్కర్ పేరుచెప్పుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ విద్యార్థి నాయకులు రాబోయే తరానికి, ఏ సందేశమిస్తున్నారు?
నెత్తురు మండే శక్తులునిండే సైనికులుగా రమ్మని యువతను తమ కవితల ద్వారా ప్రేరేపించిన శ్రీశ్రీ కూడా విద్యార్థుల ఈ వింత ప్రవర్తనకు నివ్వెరపోక మానడు. మొన్నటికి మొన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిసెంబరు 10న ‘బీఫ్ ఫెస్టివల్’జరుపుతామని భీష్మించిన కొందరు ఆకతాయిలు ప్రభుత్వ చర్యలతో తోక ముడిచారు. అంతకు కొన్ని నెలల ముందు హైద్రాబాద్ విశ్వవిద్యాలయంలో స్ర్తి, పురుష భేదం లేకుండా ‘ముద్దులు’ యిచ్చుకునే ముచ్చటపై కొందరు విద్యార్థి నాయకులు పట్టుబట్టారు. ‘నైతిక నిఘా’ మాకెందుకని విద్యార్థులు, విద్యార్థినులు యిష్టారాజ్యంగా ముద్దులు కురిపించుకోవడం, వావివరుస లేకుండా ‘స్వేచ్ఛ’పేర బరితెగించడం వివేకానందుడు పుట్టిన భూమిలో జరగాల్సిన పనేనా? అదీ ‘విద్యాతురాణాం నసుఖం న నిద్ర’అన్న చందానికి భిన్నంగా! విద్యార్థి సమస్యలమీద ఉద్యమించాల్సిందిపోయి సభ్యతకు, సంస్కారానికి తిలోదకాలిచ్చి వర్తించడం న్యాయమేనా? కొందరు విద్యార్థులు ఈ ‘ముద్దుల’ మురిపెం వద్దని, అధికారులను దీన్ని ఆపమని ఆందోళనచేస్తే తప్పా? ఇరువర్గాల వారిని పోలీసులు అరెస్టుచేశారు. ‘నేను నగ్నంగా నడిచినా ననె్నవరూ ప్రశ్నించకూడదు’ అన్న వ్రాతలున్న ప్లేకార్డులతో విద్యార్థివర్గం ఊరేగింపులు జరపడం విశ్వవిద్యాలయానికి వనె్నతెచ్చే అంశమేనా? ఈ వర్గం పోలీసులతో వాగ్వివాదానికి దిగడం జరిగింది. 2014, నవంబరు 2న కొచ్చిన్‌లో ఫేస్‌బుక్‌లో ప్రచురించిన ‘కిస్ ఆఫ్ లవ్’ పేజికి 154,404 ఓట్లు అనుకూలంగా వచ్చాయి. ఇది విద్యార్థి లోకాన్ని తప్పుదారి పట్టించడంకాక మరేమిటి? కేరళనుండి అది హైద్రాబాద్ విశ్వవిద్యాలయానికి పాకింది. రాజ్యాంగం సెక్షన్ 294(ఎ), ఐపిసి కింద యిది శిక్షార్హం కూడా. శిక్షణకోసం వచ్చిన విద్యార్థులు విశ్వవిద్యాలయాన్ని శిక్షలు వేసే కేంద్రంగా మారుస్తున్నారా? వారి తల్లిదండ్రులు, వారిని ఉద్యోగాల్లోకి తీసుకునే వ్యాపార సంస్థలు, వారికి శిక్షణనిస్తున్న అధ్యాపకులు, మొత్తంగా సమాజం దీన్ని గురించి ఆలోచించవలసి వుంది.
వేముల రోహిత్ వ్రాసిన ఆత్మహత్య తాలూకు వాగ్మూలంలో ‘‘కేవలం తనకున్న సమస్యలే తన నిర్ణయానికి కారణమని, తన ఆలోచనలకు, ఆచరణకు పెరుగుతున్న అంతరమే తన సంఘర్షణకు మూలమని, కార్ల్‌సాగన్ లాగా మంచి రచయితను కావాలనుకున్నానని, విజ్ఞానాన్ని, నక్షత్రాలను, ప్రకృతిని ప్రేమిస్తానని, కాని తాను ప్రేమించిన ప్రజలు ప్రకృతిని తిరస్కరించడంతో కలతచెందానని, మనది కృత్రిమమైన జీవితమని, మనిషి విలువ కేవలం ఓట్లకు పరిమితమైందని, నా విలువే నాకు తెలియని పరిస్థితిలో ఆ నక్షత్రాలవద్దకే వెళ్తున్నానని, నేనెవరి మీద ఆరోపణ చేయడం లేదని’’ వ్రాశాడు. రోహిత్ వాగ్మూలం చదివితే అతనెంత సున్నిత మనస్కుడో మనకు అర్థమవుతుంది. కాని అతని సహజ గుణాన్ని సమాధిచేసి విద్యార్థి సంఘాలు విర్రవీగుతున్నాయ. ఇది పట్టని పత్రికలకు, నాయకులకు కావలసినంత పని దొరికింది. రోహిత్ చావు మిగతా వారందరికీ పెళ్ళిభోజనమయింది. కాని ఒక దేశ పౌరుడు భావదాస్యంతో బలి అయ్యాడన్నది చేదు నిజం. కొన్ని పత్రికలు కేంద్రమంత్రులను నిందిస్తూ వ్యాసాలు రాశాయి. యూనివర్సిటీ చదువుల గురించి స్మృతి యిరానీకేం తెలుసు అని ప్రశ్నించారు. నిజమే ఆమె యూనివర్సిటీ చదువు చదివుండకపోవచ్చు. అంతమాత్రంచేత విశ్వవిద్యాలయాలను విలయానికి నెలవుగా మారుస్తున్న సిద్ధాంత భావజాలం గురించి, సోకాల్డు ప్రగతి కాముక పోకడలను గురించి తెలియంది కాదు. విశ్వవిద్యాలయాలకు ఏటా వందల కోట్ల ప్రజాధనం వెచ్చిస్తున్న విషయం, అవి సద్వినియోగం కావాల్సిన అవసరం తెలియంది కాదు.
‘తనకు హిందూ మతమంటే ద్వేషమని’ బహిరంగంగా చెప్పిన రోహిత్ లాంటి వాళ్ళెందరో ఈ దేశంలో ‘అసహనపు చిచ్చు’ను రగిలిస్తున్న రగడ తెలియంది కాదు. సీతారాం ఏచూరి, కేజ్రీవాల్, జగన్ లాంటివాళ్ళు ‘రోహిత్’ను తమ ‘దళిత ప్రాజెక్టు’లో తురుపుముక్కగా వాడుకుంటున్న విషయం తెలియంది కాదు. అసలు ‘కులం’పేరున ‘రోహిత్’ను అవమానించిన దాఖలాలే లేవు. చదువులో ప్రతిభావంతుడైన రోహిత్ రెండుసార్లు సిఎస్‌ఐఆర్ ఉపకార వేతనాన్ని పొందాడు. రోహిత్‌తో సహా ఐదుగురిపై విశ్వవిద్యాలయ పాలక మండలి తీసుకున్న క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అతనికి ఉపకార వేతనం ఆగింది. ఎన్ని చెప్పినా మనిషికి ఆర్థిక ఆసరాలేకపోతే మానసికంగా క్రుంగిపోతాడు. ‘రోహిత్’అటు ఆర్థికంగా ఇటు సిద్ధాంతపరంగా తేల్చుకోలేని స్థితిలో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
రోహిత్‌ను వ్యతిరేకించేవాళ్ళుకూడా దీన్ని మానవతా దృక్పధంతో అర్థంచేసుకోవాలి. ‘రోహిత్’ పేర రాజకీయం చేస్తున్న వారంతా నిజానిజాలు నిలకడమీద తేలుతాయని గ్రహించాలి. నిజానికి శ్రీ దత్తాత్రేయ తరహాలో కాంగ్రెస్ నాయకుడు వి.హన్మంతరావు కూడా విశ్వవిద్యాలయంలో అశాంతి నెలకొందని, ఆత్మహత్యలు జరుగుతున్నాయని 2014లో మానవ వనరుల శాఖకు ఉత్తరం రాశారు. అది వాస్తవం కూడ. విద్యార్థుల ఆత్మహత్యలపై ఓ సమగ్ర నివేదిక సైతం సమర్పించబడింది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ముస్లిం విద్యార్థులే అధిక శాతం అని తేలింది. గ్రామీణ ప్రాంతాలనుంచి వచ్చిన వీరి నేపధ్యం, ఆర్థిక సమస్యలు, కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం వంటి కారణాలను తమ సిద్ధాంత భావజాలానికి అనుకూలంగా మార్చుకుంటున్న విద్యార్థి సంఘాల విపరీత పోకడలపై నిఘా పెంచాల్సి వుంది. అందరం ఒకటేనని సరస్వతీ దేవాలయంలో ఆమె పాదాలవద్ద మువ్వలమని, విద్య వికసించే క్రమంలో ఆమె మోముపై చిరునవ్వులమని విద్యార్థులంతా తెలుసుకోవాలి. విద్య సముపార్జనలో శీలానికి పెద్దపీట వేయాలని గ్రహించాలి.

- తాడేపల్లి హనుమత్‌ప్రసాద్