జాతీయ వార్తలు

జామియా యూనివర్శిటీకి ఐదు వరకు సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా నిన్న జరిగిన ఆందోళనలపై యూనివర్శిటీలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. దీంతో విద్యార్థులు హాస్టల్‌ను వీడి వెళుతున్నారు. పరీక్షలను వాయిదా వేశారు. యూనివర్శిటీకి సెలవులను ఐదవ తేదీ వరకు పొడిగించారు. నిన్న జరిగిన ఢిల్లీ ఘటనలకు సంబంధించి రెండు కేసులను పోలీసులు నమోదు చేశారు. కాల్పులు, అల్లర్లు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం, ప్రభుత్వ పనులకు ఆటంకం కలిగించినందుకు న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో మొదటి కేసు, జామియా నగర్ పోలీస్ స్టేషన్‌లో రెండవ కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. యూనివర్సిటీలో ఈ మధ్య జరగాల్సిన అన్ని పరీక్షలను యూనివర్సిటీ అధికారులు వాయిదా వేశారు.