అదిలాబాద్

కరవు జిల్లాగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* రైతు సంఘాల జెఎసి
ఉట్నూరు, నవంబర్ 27: ఆదిలాబాద్‌ను కరవు జిల్లాగా ప్రకటించాలని రైతు సంఘాల జెఎసి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రైతు సంఘాల జెఎసి జిల్లా కోకన్వీనర్లు బానోత్ రామారావు, నేతావత్‌రాందాస్, జాదవ్ రమణనాయక్‌లు మాట్లాడుతూ వర్షాభావం వల్ల రైతులు ఎంతోనష్టపోయారని, వరి పంటలు సైతం పండించలేదని, ఇవి ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాలను కరవు జిల్లాలుగా ప్రకటించిన కెసి ఆర్‌కు ఆదిలాబాద్ పరిస్థితి కనబడలేదా అని ప్రశ్నించారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు, అధికార ఎంపి, ఎమ్మెల్యేలతో పాటు గ్రామ గ్రామాన టీ ఆర్ ఎస్ ప్రతినిధులు ఉన్నారని, కనీసం వారికైన తెలియకపోవడం సిగ్గుచేటని అన్నారు. పత్తి పంటలు సైతం ఎంతో నష్టం వాటిళ్లిందని, కనీస మద్దతు క్వింటాలుకు రూ.6వేలు, సోయకు రూ.5వేల మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. జిల్లాలో రైతులు అప్పుల బాధతో 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకోగా కనీసం వారిని పరామర్శించడానికి అధికార ప్రతినిధులకు సమయం దొరకడం లేదన్నారు. వ్యవసాయ శాఖ అధ్వర్యంలో జిల్లాలోని 22 మండలాల్లో కరవు ఉందని ప్రతిపాదనలు పంపినా ఎందుకు ప్రకటించలేదో తెలుపాలని డిమాండ్ చేశారు. కరవు జిల్లాగా ప్రకటించాలంటూ ఈనెల 30న ఉట్నూరు ఆర్డీవో కార్యాలయం ముందు, డిసెంబర్ 1న కలెక్టర్ కార్యాలయం ముందు రైతు సంఘాల జె ఎసి అధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ ధర్నాకు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్‌తో పాటు పలువురు పాల్గొంటున్నందునా రైతులు, మేదావులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో నాయకులు దర్మునాయక్, రామారావు, రాములు తదితరులు పాల్గొన్నారు.