రాష్ట్రీయం

అసెంబ్లీ వద్ద నిరుద్యోగుల ధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పలువురు జెఎసి నేతల అరెస్టు

హైదరాబాద్, డిసెంబర్ 17: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేయాలని, ఈ మేరకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం అసెంబ్లీ ఎదుట నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉపాధి లేక నిరుద్యోగులు అలమటిస్తుంటే అభివృద్ధి, రాజధాని నిర్మాణం పేరుతో నిరుద్యోగులను మోసగిస్తున్నారని టిడిపి ప్రభుత్వంపై జెఎసి నాయకులు మండిపడ్డారు. ఓవైపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా మరోవైపు నిరుద్యోగ జెఎసి అసెంబ్లీ ఎదుట ధర్నాకు పూనుకోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో కాసేపు ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరుద్యోగ జెఎసి కార్యకర్తలు అసెంబ్లీలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరుద్యోగ జెఎసి నాయకుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. సుమారు 60మంది నిరుద్యోగ జెఎసి కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జెఎసి నాయకులు విలేఖరులతో మాట్లాడుతూ ఏపి ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని, రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీ ఉండగా భర్తీ చేయడంలో తాత్సారం తగదన్నారు.