తెలంగాణ

ఆత్మహత్యలు పరిష్కారం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అర్థిక ఇబ్బందులతోనే చదువుకు ఆటంకం: జెఎసి చైర్మన్ కోదండరాం

సిద్దిపేట, డిసెంబర్ 10 : ఆత్మహత్యలు సమస్యల పరిష్కారానికి మార్గం కాదని జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం స్పష్టం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు కావస్తున్నా నేటికీ అందరూ చదువుకోలేని స్థితిలో ఉండడం దురదృష్టకరమన్నారు. మెదక్ జిల్లా సిద్దిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని సిసిసి ఆధ్వర్యంలో నిర్వహించిన బాల ప్రతిభ మేళా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. తనను చదివించడం లేదని ఆదిలాబాద్ జిల్లాలో ఒక బాలిక ఆత్మహత్య చేసుకుందని, కరీంనగర్ జిల్లాలో ఫీజు కట్టలేక విద్యార్థి మృతి చెందిన సంఘటనను కోదండరాంగుర్తు చేశారు. ఈ రెండు ఘటనలు చదువుకునేందుకు చాలా ఆటంకాలు ఎదురవుతున్నాయని విషయాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. పాఠశాలల్లో ఒకటో తరగతిలో వంద మంది విద్యార్థులు చేరితే 10తరగతి, ఇంటర్, డిగ్రీకి వచ్చే సరికి 40 శాతానికి పైగా విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో 50 శాతానికిపైగా ప్రైవేటు విద్యపై మోజు కనబరుస్తున్నారన్నారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాలు, పేదరికంలో మగ్గుతున్నవారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలను ఆశ్రయిస్తున్నారన్నారు. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు కట్టలేక చదువుకు దూరమవుతున్నారన్నారు. అర్థిక ఇబ్బందులు వల్లనే చాలామంది ఉన్నత విద్యను అభ్యసించకలేకపోతున్నట్లు ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో ఉదయం 8గంటల నుండి రాత్రి 7గంటల వరకు చదువు, మార్కులు ధ్యేయంగా పనిచేస్తున్నారు. బాలలకు ఆట, పాటలు కరువవడం వల్ల మానసికంగా ఎదగలేకపోతున్నారన్నారు. బాలలకు చదువుతో పాటు ఆట, పాటలు తప్పనిసరి చేయాలని ఆయన సూచించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగే బాలోత్సవ్‌లో వేలాది మధ్యన నిర్వహిస్తారన్నారు. ఢిల్లీ నుండి వెయ్యిమంది బాలలు ఈ బాలోత్సవంలో పాలుపంచుకుంటారన్నారు. బాల ప్రతిభ మేళా ఉత్సవంలో వేలాది మంది విద్యార్థులను భాగస్వాములను చేయాలన్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం, సాంస్కృతిక ప్రదర్శన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి సభ్యుడు పాపయ్య, తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు నందిని సిధారెడ్డి, జాతీయ ఆహార భద్రత సలహదారులు రమా మెల్కోటి, కొమురవెళ్లి అంజయ్య, మోహన్, దుర్గవ్వ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.