బిజినెస్

‘జగమొండి’ల భరతం పట్టండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్తిస్థాయి అధికారాలు, స్వయం ప్రతిపత్తినిస్తున్నాం
ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు జైట్లీ స్పష్టీకరణ
ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్న నిరర్థక ఆస్తులపై సీరియస్

న్యూఢిల్లీ, నవంబర్ 23: ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రమాదకర స్థాయికి చేరుకున్న నిరర్థక ఆస్తుల (ఎన్‌పిఎ)పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఇక్కడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) భవనంలో ప్రభుత్వరంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థల చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లతో జైట్లీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆర్‌బిఐ అధికారులు కూడా పాల్గొనగా, వారందరితో మొండి బకాయిల సమస్యపై చర్చించారు. వివిధ రంగాల్లో పెరుగుతున్న నిరర్థక ఆస్తుల సమాచారాన్ని తెలుసుకున్న జైట్లీ.. పలు ప్రభుత్వ పథకాల అమలు, రుణాల పంపిణీ వంటి వాటిపైనా చర్చించారు. ఈ క్రమంలోనే ఉద్దేశపూర్వకంగా రుణాల ఎగవేతకు పాల్పడుతున్నవారిపై చర్యలు తీసుకోవడానికి బ్యాంకర్లకు పూర్తిస్థాయి అధికారాలు, స్వయం ప్రతిపత్తి ఉంటుందని ఈ సందర్భంగా జైట్లీ స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది జూన్ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు 6.03 శాతానికి చేరాయి. మార్చి నాటికి ఇవి 5.20 శాతంగా ఉన్నాయి.
మార్కెట్ పరిస్థితులపైనే ఆధారం
ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణపై స్పందిస్తూ స్టాక్ మార్కెట్లపైనే అది ఆధారపడి ఉందని, మార్కెట్ పరిస్థితులు ఎప్పుడు నిలకడగా ఉంటాయో అప్పుడే వాటాల విక్రయమని జైట్లీ స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరం (2015-16)లో ప్రభుత్వ సంస్థల వాటాల విక్రయం ద్వారా 69,500 కోట్ల రూపాయల నిధులను అందుకోవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది తెలిసిందే. అయితే మార్కెట్ల నష్టాలతో ఇప్పటిదాకా ఆశించిన స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ జరగలేదు. దీంతో మార్కెట్లు కుదుటపడినప్పుడే వాటాలను విక్రయిస్తామని జైట్లీ స్పష్టం చేశారు.
ఉక్కు, అల్యూమినియం రంగాల అభివృద్ధికి..
అంతర్జాతీయ మార్కెట్‌లో పడిపోయిన ధరల కారణంగా కుదేలైన ఉక్కు, అల్యూమినియం పరిశ్రమలను ఆదుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. ఈ రంగాలకు బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందించే అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నామన్నారు. దీనికి సంబంధించి రెవిన్యూ శాఖ, బ్యాంకుల మధ్య మరిన్ని చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు.
(చిత్రం) సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకర్లతో సమావేశమైన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ