ఆంధ్రప్రదేశ్‌

నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు:జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: అసెంబ్లీలో నిబంధనల ప్రకారమే సీట్ల కేటాయింపు జరిగిందని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రతి అంశాన్ని సమస్యాత్మకంగా చేస్తున్నారని, కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్ రూలింగ్ ఇచ్చారని, 40 ఏళ్ల అనుభవం వున్న వ్యక్తి అయినా రూల్స్ ప్రకారం కూర్చోవాలని అన్నారు. సంఖ్యాబలం తక్కువగా ఉన్నా సమయం కేటాయిస్తున్నామని, గతంలో మీరు ఎలా ప్రవర్తించారో గమనించాలని, స్పీకర్‌ను అగౌరపరచటం మంచి పద్ధతి కాదని అన్నారు. సానుభూతి కోసం పాకులాడటం మంచిది కాదని అన్నారు.