ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో అపార అవకాశాలు: జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అంధ్రప్రదేశ్‌లో పరిశ్రమ ఏర్పాటుకు అపార అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన అమెరికాలో పర్యటిస్తున్న విషయం విదితమే. వాషింగ్టన్‌ డీసీలో యూఎస్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సమావేశానికి హాజరయ్యారు. అక్కడ భారత రాయబారి హర్షవర్థన్‌ ష్రింగ్లాతో సమావేశమై ముఖాముఖి చర్చలు జరిపారు. అనంతరం యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో ప్రసంగించారు. పరిశ్రమ పెట్టేందుకు ఒక్క దరఖాస్తు చేసుకుంటే చాలని, వారికి కావాల్సిన అనుమతులన్నీ వచ్చేలా ముఖ్యమంత్రి కార్యాలయమే దగ్గరుండి పర్యవేక్షిస్తుందని ఈ సందర్భంగా చెప్పారు. తాము ఏర్పాటు చేసిన ఇన్వెస్టెమెంట్‌ ప్రమోషన్‌ అండ్‌ మానిటరింగ్‌ అథారిటీ (ఇప్మా) పారిశ్రామికవేత్తలకు, పెట్టుబడిదారులకు అండగా ఉంటుందన్నారు.