ఆంధ్రప్రదేశ్‌

మొదటి వాగ్ధానం అమలులోకి తెచ్చాం:సీఎం జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు:13 జిల్లాల్లోని రైతుల ముఖాల్లో ఆనందం చూసేందుకు వైఎస్‌ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకాన్ని ప్రవేశపెట్టామని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయన వెంకటాచలం మండలం కాకుటూరులో విక్రమ సింహపురి యూనివర్శిటీలో వైఎస్‌ఆర్ రైతు భరోసా పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 54 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. మేనిఫెస్టోలో తొలి వాగ్ధానంగా పేర్కొన్నామని చెప్పిన సమయం కంటే 8 నెలలు ముందుగానే దీన్ని అమలులోకి తీసుకువచ్చామని అన్నారు. ఒక్కొక్క రైతుకి రూ.13,500లు అందుతాయని చెప్పారు. విపత్తులు వచ్చినపుడు గతంలో మనసున్న ప్రభుత్వం లేదని అన్నారు. కాని తమ ప్రభుత్వం వచ్చిన తరువాత రైతులకు అధిక ప్రాధాన్యం ఇచ్చిందని, కౌలు రైతులకు భరోసా కల్పించేందుకు కౌలు రైతుల చట్టం తీసుకురాగలిగామని చెప్పారు.