రాష్ట్రీయం

ఎమ్మెల్యేలను కొంటున్నారు సిగ్గుందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

20 ఆరోపణలు చేస్తున్నా
సిబిఐ దర్యాప్తు జరిపించండి
ఎన్నికల హామీలేమయ్యాయి
అందుకే అవిశ్వాస తీర్మానం
చంద్రబాబుపై జగన్ ఆగ్రహం

హైదరాబాద్, మార్చి 14: అవిశ్వాస తీర్మానంపై సోమవారం అసెంబ్లీలో వాడివేడిగా జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై వైకాపా అధినేత జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఒక దశలో ‘మీకు సిగ్గుందా..’అంటూ నిప్పులు చెరిగారు. చంద్రబాబు సర్కార్ అవినీతికి సంబంధించి 20 ఆరోపణలు చేస్తున్నానని, వాటిపై సిబిఐ దర్యాప్తుకు సిద్ధమా అంటూ జగన్ సవాలు విసిరారు. రాజకీయ లబ్దికోసమే తనపై అబద్దాలు, అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్ విమర్శించారు. ఎపి శాసనసభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిటాల హత్య కేసుకు సంబంధించి తనపై ఆరోపణలు చేశారని అన్నారు.వంగవీటి మోహన్‌రంగా హత్య దగ్గరుండి చంద్రబాబు చేయించారని చేగొండి హరిరామ జోగయ్య తన పుస్తకంలో రాశారని జగన్ చేసిన ఆరోపణలను టిడిపి సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. హరిరామ జోగయ్య పుస్తకాన్ని ప్రస్తావిస్తే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. చంద్రబాబు నుండి మంత్రుల వరకూ అందరూ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. తమ వద్ద ఉన్న సభ్యులతో నెగ్గుతామని తాను అవిశ్వాసం పెట్టలేదని, ఎమ్మెల్యేలను కోట్లకు కోట్లు పెట్టి కొనుగోలుచేస్తున్న తీరును చెప్పడానికి అవిశ్వాసం ప్రవేశపెట్టామని అన్నారు. 8 మందితో రాజీనామా చేయించండి, లేదా వారిని అనర్హులుగా గుర్తించండి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయించండి ఎవరు గెలుస్తారో తేలిపోతుందని సిఎంకు జగన్ సవాల్ విసిరారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే చూస్తూ ఊరుకోలేక అవిశ్వాసం ప్రవేశపెట్టామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేరిందా అని ప్రశ్నించారు. రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామని అన్నారు, అవన్నీ ఎక్కడకు పోయాయని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు కల్లబోల్లి కబుర్లు చెప్పి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతి పక్షం లేకుండా కుట్ర పన్నుతున్నారని అది చూస్తుంటే బాధేస్తోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జగన్ వివిధ శాఖల్లో జరిగిన అవినీతిని శాఖల వారీ వివరించారు. మలుఖ్యమంత్రి అయితే అర్హులందరికీ మూడుసెంట్ల స్థలంతో పాటు ఇల్లు ఇస్తామని చెప్పారని,అందరికీ పెన్షన్లు ఇస్తామని అన్నారని, రైతులకు కనీస మద్దతు ధర గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయిందని పేర్కొన్నారు. ఒప్పంద, పొరుగుసేవల సిబ్బంది తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయోనని భయపడుతున్నారని , చంద్రబాబు మాటలు నమ్మి రుణాలు కట్టని రైతులు తీవ్రంగా మోసపోయారని అన్నారు. రాష్ట్రంలో 10వేల మంది డిఎస్సీ రాసి ఉద్యోగాలు లేకుండా ఎదురుచూస్తున్నారని , సంఘమిత్రలకు ప్రభుత్వం తరఫున ఇచ్చే 2వేల రూపాయిలు కూడా ఇవ్వకుండా మోసం చేశారని అన్నారు.