రాష్ట్రీయం

బాక్సైట్‌ను అడ్డుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామసభల అనుమతుల్లేవు చంద్రబాబువన్నీ అబద్ధాలే వైసీపీ నేత జగన్ ధ్వజం

విశాఖపట్నం, డిసెంబర్ 10: విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను అడ్డుకుంటామని, ఎటువంటి పరిస్థితుల్లోనూ తవ్వకాలు జరగనీయబోమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో గురువారం జరిగిన బహిరంగసభలో మాట్లాడిన ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద అబద్దాలకోరంటూ విరుచుకు పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శే్వతపత్రంలో బాక్సైట్ తవ్వకాలకు స్థానిక గ్రామసభల అనుమతులు ఉన్నాయంటూ చెప్పడంపై ఆదీవాసీలు పెద్దఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారన్నారు. గ్రామసభల అంగీకారం లేకుండా బాక్సైట్ తవ్వకాలకు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అనుమతులు ఇచ్చిందని ప్రశ్నించారు. బాక్సైట్ తవ్వకాలకు గ్రామసభల అంగీకారం లేదంటూ ముక్తకంఠంతో చెబుతున్న స్థానిక ఆదివాసీలే ఉద్యమించారని జగన్ తెలిపారు. బాక్సైట్ తవ్వకాల కోసం జారీ చేసిన జీవో నెంబర్ 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ లక్షల గొంతులు ఒక్కటయ్యాయన్నారు. బాక్సైట్ తవ్వకాల కోసం చంద్రబాబు కేంద్రానికి నాలుగుసార్లు లేఖలు రాసి, అనుమతులు పొందారన్నారు. బాక్సైట్‌కు తవ్వకాలకు వ్యతిరేకంగా కలిసిపోరాడుదామని ఈ సందర్భంగా జగన్ పిలుపునిచ్చారు. గిరిజనుల మనుగడకు తీవ్ర విఘాతం కలిగించే బాక్సైట్ తవ్వకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సాగనివ్వమని తెలిపారు. ప్రభుత్వం ఇప్పటి వరకు ట్రైబల్ అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయకపోవడంతో గిరిజన ప్రాంతాల అభివృద్ధి కుంటుపడిందన్నారు. వైఎస్సార్‌సిపికి చెందిన గిరిజన ఎమ్మెల్యేలు ఆరుగురు ఉన్నందునే రాష్ట్ర ప్రభుత్వం అడ్వయిజరీ కమిటీని ఏర్పాటు చేయలేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఓ మాట, అధికారంలోకి వచ్చిన తరువాత మరో మాట మాట్లాడుతున్నారన్నారు.
ఎంపికైన డిఎస్సీ అభ్యర్ధులకు ఇప్పటికీ నియామకాలు జరగలేదని జగన్ ఆందోళన వ్యక్తంచేశారు. తమ పిల్లలు ప్రయోజకులు అవుతారనే కొండంత ఆశతో పేద కుటుంబాలు అప్పులు చేసి మరీ పిల్లలను పట్టణాలకు పంపించి డిఎస్సీ శిక్షణ ఇప్పించారన్నారు. ఈ విధంగా ఎంపికైన అనేకమందికి ఇప్పటి వరకు ఉద్యోగ నియామకాలు నిర్వహించలేదన్నారు. దీనివల్ల వీరంతా రోడ్డున పడుతున్నారన్నారు. బహిరంగసభకు ప్లకార్డులతో వచ్చిన డిఎస్సీ అభ్యర్ధుల నుంచి వాటిని తీసుకుని జగన్ ప్రదర్శించారు. క్లస్టర్‌ల పేరుతోచిన్నచిన్న ప్రభుత్వ పాఠశాలలే ఎత్తివేస్తూ ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాలను తొలగించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమయ్యారన్నారు. దీనివల్ల గిరిజన ప్రాంతాల్లో విద్యావ్యవస్థ మరింత కుంటుపడనుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన ప్రసంగానికి ముందు స్థానిక గిరిజనులను వేదిక పైకి పిలిపించి వారితో మాట్లాడించారు. ఈ సందర్భంగా గిరిజనులు బాక్సైట్ తవ్వకాలు జరిపి తమ జీవితాలను, ప్రాంతాన్ని నాశనం చేయవద్దని కోరారు. ఈ సభకు గిరిజనులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. (చిత్రం) విశాఖ ఏజెన్సీలోని చింతపల్లిలో గురువారం జరిగిన సభలో ప్రసంగిస్తున్న వైకాపా అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి