రాష్ట్రీయం

రోజాను అడ్డుకున్న మార్షల్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తరలింపు
* స్పృహ కోల్పోవడంతో నిమ్స్‌లో చేరిక
* పరామర్శించిన జగన్
హైదరాబాద్, డిసెంబర్ 19: అసెంబ్లీ నుంచి ఏడాది పాటు సస్పెన్షన్‌కు గురైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా శనివారం అసెంబ్లీ ఆవరణకు రావడంతో మార్షల్స్ అడ్డుకున్నారు. ఆమెను బలవంతంగా కారు ఎక్కించి నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళగా, అక్కడ ఆమె షుగర్ లెవల్స్ పడిపోయి, స్పృహ కోల్పోవడంతో ‘నిమ్స్’లో చేర్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న అభియోగంతో ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేస్తూ అసెంబ్లీ తీర్మానం ఆమోదించిన సంగతి తెలిసిందే. ఇలాఉండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం ఉదయం 8 గంటలకు అసెంబ్లీ ఆవరణలోని తన ఛాంబర్‌లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమై అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సుమారు 8.30 గంటల సమయంలో రోజా అసెంబ్లీ ఆవరణలోకి చేరుకుని జగన్ ఛాంబర్ వైపు అడుగులు వేయసాగారు. ఈ దశలో మార్షల్స్ ఆమెను అడ్డుకున్నారు. చీఫ్ మార్షల్ కూడా అక్కడికి చేరుకుని అసెంబ్లీ నుంచి సస్పెండైనందున లోపలికి రాకూడదని, ఇది స్పీకర్ ఆదేశం అని చెప్పారు. అయినా ఆమె వినిపించుకోకుండా ముందుకు వెళ్ళేందుకు ప్రయత్నించారు. రోజాను అడ్డుకుంటున్న విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకుని ఆమెకు మద్దతుగా నిలిచారు. అసెంబ్లీ ఆవరణలోకి సస్పెండైన సభ్యులు రావచ్చని ఎమ్మెల్యేలు మార్షల్స్‌తో వాదించారు. అయినా వారు వినిపించుకోకుండా రోజాను బలవంతంగా కారులో ఎక్కించి, సైఫాబాద్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళుతున్నట్లు చెప్పి, నేరుగా నాంపల్లి పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్ళారు. కాగా అక్కడ రోజాకు కళ్ళుతిరిగినట్లయి స్పృహ కోల్పోయారు. దీంతో ఆందోళన చెందిన పోలీసులు వెంటనే ఆమెను ‘నిమ్స్’కు తీసుకెళ్ళి చేర్పించారు. పోలీసుల దురుసు ప్రవర్తన వల్లే రోజా స్పృహ కోల్పోయారని పార్టీ నాయకులు ఆరోపించారు.
ఇలాఉండగా శనివారం అసెంబ్లీ వాయిదాపడిన అనంతరం జగన్ తన సహచర ఎమ్మెల్యేలను తీసుకుని నిమ్స్‌కు వెళ్ళి ఆమెను పరామర్శించారు. ఆమె ఆ రోగ్యం గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆందోళన చెందాల్సిన అవస రం లేదని కోలుకుంటున్నారని చెప్పారు.
స్పీకర్‌ను కలవనివ్వలేదు..
రోజాను పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడుతూ అసెంబ్లీ ఆవరణలో స్పీకర్ ఛాంబర్‌కు వెళ్ళి ఒక నోట్ ఇవ్వాలనుకున్న రోజాను అడ్డుకున్నారని విమర్శించారు. సెక్స్ రాకెట్ గురించి తాము వాయిదా తీర్మానం ఇచ్చినా పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. అసెంబ్లీలో ఉన్నది రెండే పార్టీలని అన్నారు. బిజెపి ఉన్నా, సగం టిడిపి కండువా కప్పుకున్నదని ఆయన విమర్శించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతారా? అని ప్రశ్నించగా, తమకు మెజారిటీ ఉంటే తప్పకుండా పెట్టే వాళ్ళమని జగన్ తెలిపారు. (చిత్రం) అసెంబ్లీ నుంచి తరలిస్తుండగా స్పృహ కోల్పోయిన రోజా, ఆసుపత్రిలో రోజాను పరామర్శిస్తున్న జగన్

రోజా సస్పెన్షన్ అప్రజాస్వామికం
* సర్కార్‌పై వైకాపా ఎమ్మెల్యేల ధ్వజం
హైదరాబాద్, డిసెంబర్ 19: శాసనసభలో ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు ధ్వజమెత్తారు. శాసనసభ్యురాలు రోజాను అప్రజాస్వామికంగా, శాసనసభ నియమావళికి విరుద్దంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు. శనివారం మీడియా పాయింట్ వద్ద వైఎస్‌ఆర్‌సిపి సభ్యులు చెవిరెడ్డి భాస్కరరెడ్డి, కె.శ్రీధర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, వై.విశే్వశ్వరరెడ్డి, ఈశ్వరి మాట్లాడుతూ ప్రజా సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకు వచ్చి పరిష్కారానికి కృషి చేద్దామనే ఆలోచనతో ఉన్న ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం ప్రతిసారి గొంతు నొక్కుతోందని అన్నారు. మహిళల మాన, ప్రాణాలను ఫణంగా పెట్టి విజయవాడ కేంద్రంగా జరుగుతున్న సెక్స్‌రాకెట్, కాల్‌మనీ దందాపై ప్రభుత్వాన్ని నిలదీసి నిగ్గుతేల్చేందుకు తాము ప్రయత్నిస్తుంటే, ఎక్కడ తమ శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు పాత్ర బయటపడుతుందోనని ప్రభుత్వం మా నాయకుడు వైఎస్ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. సొంత జిల్లా మహిశా శాసనసభ్యురాలు అని కూడా చూడకుండా రోజాపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించడం దారుణమని అన్నారు.

సభ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు
రోజా వ్యవహారంపై స్పీకర్ కోడెల స్పందన
హైదరాబాద్, డిసెంబర్ 19: అసెంబ్లీకి విశ్వసనీయత ముఖ్యమని, ప్రజలు తమ సమస్యల పరిష్కారం లభిస్తుందనే ఆశతో అసెంబ్లీవైపు చూస్తుంటారని స్పీకర్ కోడెల శివప్రసాదరావు అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలో అధికార, విపక్ష పార్టీల ఎమ్మెల్యేల వాగ్వాదం, వైకాపా ఎమ్మెల్యే రోజాపై ఏడాదిపాటు విధించిన సస్పెన్షన్ వ్యవహారంపై సభలో మాట్లాడారు. అసెంబ్లీ అంటే ప్రజాస్వామ్యానికి మూలస్తంభమన్నారు. అసెంబ్లీలో సభ్యులు బాధ్యత ప్రకారం నడుచుకోవాలన్నారు. తాను రెండు పార్టీల సభ్యులు చెప్పిందంతా విన్నానన్నారు. అన్‌పార్లమెంటరీ పదాలు ఎవరు వినియోగించినా తాను రికార్డుల నుంచి తొలగిస్తునానన్నారు. సభ్యులు కెమెరాలకు అడ్డుగా నిలబడుతున్నారు, ఒక సభ్యుడు లేచి మాట్లాడితే మరో సభ్యుడు లేచి నిలబడరాదని నిబంధనలు ఉన్నాయన్నారు. అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. సభ్యులు ప్రతి రోజూ పోడియం వద్దకు వచ్చి నినాదాలు చేస్తున్నారన్నారు. గతంలో ఇటువంటి సంఘటనలుజరిగితే క్షమాపణ చెప్పిన సందర్భాలు ఉన్నాయన్నారు. సభ నిర్ణయం సుప్రీం అన్నారు. సభ నిర్ణయాన్ని ప్రశ్నించే హక్కు ఎవరికీ ఉండదన్నారు. తమిళనాడు, మహారాష్టల్రో కూడా సభ్యుల ప్రవర్తన బాగాలేనప్పుడు కఠిన నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. తాను జగన్‌కు ఈ రోజు చర్చల సందర్భంగా ఆరుసార్లు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చానన్నారు. స్పీకర్ స్ధానానికి దురుద్దేశ్యాలు ఆపాదించరాదని, తాను నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నానన్నారు.

అదే పనిగా సభను అడ్డుకోకూడదు
* విపక్షానికి కాలువ సలహా
హైదరాబాద్, డిసెంబర్ 19: విపక్షాలు సహేతుకమైన నిర్మాణాత్మక సలహాలు ఇవ్వాలి తప్పితే అదే పనిగా సభను అడ్డుకోవడం దారుణమని టిడిపి నేత కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. శాసనసభ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ సభా నాయకుడిపైనా, సభాధ్యక్షుడిపైనా గౌరవం లేకుండా వైకాపా నేతలు వ్యవహరిస్తున్నారని, సభ హుందాతనాన్ని గుర్తించకపోవడం దారుణమని అన్నారు.రోజా సస్పెన్షన్ ఏ ఒక్కరి నిర్ణయమో కాదని, సభ అంతా ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాత స్పీకర్ దానిని ప్రకటించారనేది కూడా తెలియకపోతే ఎలా అని ఆయన నిలదీశారు. సభా సమయాన్ని దుర్వినియోగం చేస్తూ వస్తున్న వైఎస్‌ఆర్‌సిపి ఇకనైనా తమ ప్రవర్తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. సభను ప్రారంభం కాగానే వివాదస్పద ప్రకటనలు చేయడంతో పాటు సభా కార్యక్రమాలను అడ్డుకోవడం, పక్కదారి పట్టించే విధంగా నిత్యం గందరగోళం, గొడవ చేస్తూ విలువైన సభా సమయాన్ని వృధా చేయడం సరైన పద్దతి కాదని అన్నారు. సభను అడ్డుకోవడం ఏదో గౌరవమని వైకాపా నేతలు భావిస్తున్నట్టుందని, అది సరికాదని, పోడియంలోకి తరచూ రావడం వారి హుందాతనం ఏమిటో తెలియజేస్తోందని అన్నారు. గతంలో ఎవరిసీట్లలో వారు కూర్చుని సభా కార్యక్రమాలకు సహకరిస్తే వైకాపా నేతలు మాత్రం పోడియంలోనే ఎక్కువ సమయం ఉంటున్నారని చెప్పారు.
శాసనసభ స్పీకర్‌కు రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన తర్వాత కూడా ఆమె సభా ప్రాంగణాల్లోకి రావాలని చూడటం ఏమిటని అన్నారు.