ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వౌలిక సదుపాయాలు అభివృద్ధి చేస్తామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. ఆయన ప్రజావేదికలో జరిగిన కలెక్టర్ల సదస్సులో విద్యాశాఖపై సమీక్ష జరిపారు. తనకు అత్యంత ప్రాధాన్యమైనది విద్యాశాఖ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విద్యాహక్కు చట్టం అమలుకు కృషి చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామని, జనవరి 26 నుంచి ఈ పథకానికి సంబంధించిన చెక్కులు అందజేస్తామని తెలిపారు. ఇంగ్లీషు మీడియం ప్రవేశపెడతామని, తెలుగును తప్పనిసరి చేస్తామని, విద్యార్థులకు ఒకరకమైన దుస్తులు అందిస్తామని, పిల్లలకు పుస్తకాలు, షూలు కూడా అందజేస్తామని చెప్పారు. ఫీజుల నియంత్రణ కోసం అసెంబ్లీలో చట్టాన్ని తీసుకు వస్తామని వెల్లడించారు.