తమిళంలో విలన్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హీరోగా టాలీవుడ్‌లో మంచి క్రేజ్ తెచ్చుకున్న జగపతిబాబుకు ఈమధ్య చేసిన సినిమాలన్నీ వరుసగా అపజయాలు అవుతుండడంతో ఆయన విలన్‌గా టర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ‘లెజెండ్’ సినిమాతో నటుడిగా ఆకట్టుకున్న జగపతిబాబు ఇప్పుడు విలన్ పాత్రలకు ఫిక్స్ అయ్యాడు. తాజాగా ఆయన ఓ తమిళ క్రేజీ చిత్రంలో విలన్‌గా నటించేందుకు రెడీ అయ్యాడు. ప్రముఖ స్టార్ హీరో విజయ్ హీరోగా నటిస్తున్న 60వ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడట జగపతిబాబు. భరతన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి రానుంది. ఈ సినిమాలో జగపతిబాబు నటిస్తుండడంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఈ సినిమా తర్వాత ఈయన తమిళ్‌లో విలన్‌గా సెట్ అవుతాడనడంలో ఎలాంటి సందేహమూ లేదు. తాజాగా తెలుగులో కూడా మరో చిత్రంలో నటిస్తున్నాడు.