తెలంగాణ

విద్యావ్యవస్థపై దృష్టి సారించండి : గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: చదువుల తల్లి సరస్వతి ఇపుడు లక్ష్మీదేవిలా మారిందని, లోపాలమయంగా మారిన నేటి విద్యావ్యవస్థను ఇకనైనా ప్రక్షాళన చేయాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ అన్నారు. తెలంగాణ జాగృతి సంస్థ ఆధ్వర్యంలో నగరంలో శుక్రవారం నైపుణ్య అభివృద్ధి శిక్షణ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థి అటెండర్ ఉద్యోగం చేస్తున్నాడంటే విద్యా వ్యవస్థ ఎంత ఆందోళనకరంగా మారిందో ఆలోచించాలని ఆయన పాలకులకు సూచించారు. ‘మేకిన్ ఇండియా’ కార్యరూపం దాల్చాలంటే యువతకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ తప్పనిసరి అని ఆయన అన్నారు. కేంద్ర మంత్రి రాజీవ్‌ప్రతాప్ రూడీ శిక్షణ తరగతులను ప్రారంభించి, ఈ కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ జాగృతి సంస్థను అభినందించారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెరాస ఎంపీ కవిత తమ సంస్థ లక్ష్యాలను వివరించారు.