ఆంధ్రప్రదేశ్‌

మాజీ మంత్రి షాకీర్‌కు 5 ఏళ్ల జైలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: నకిలీ డీడీలతో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసగించినందుకు అనంతపురం జిల్లాకు చెందిన మాజీ మంత్రి షాకీర్‌కు 5 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తూ సిబిఐ కోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో కె.వెంకట ప్రసాద్ అనే టిడిపి నాయకుడికి ఏడేళ్ల జైలు, 6 లక్షల జరిమానా విధించారు. నకిలీ డీడీలతో సుమారు పదికోట్ల రూపాయల మేరకు మోసం చేసినట్లు గుర్తించి 18 ఏళ్ల క్రితం షాకీర్, వెంకటప్రసాద్‌తో పాటు మరో 8 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కుంభకోణం అనంతపురం జిల్లాలో తీవ్ర సంచలనం సృష్టించింది. కాగా, సిబిఐ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ తాము హైకోర్టుకు వెళతామని వెంకట ప్రసాద్ కోర్టు వద్ద మీడియాతో అన్నారు. తీర్పు వెలువడిన వెంటనే షాకీర్, వెంకటప్రసాద్‌లను పోలీసులు జైలుకు తరలించారు.