భక్తి కథలు

జైమిని భారతం - 97

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్త్రంలో ఉన్న సంగతులు మీకు మనవి చేస్తున్నాను. ఈ వివరాలను పూర్వం దత్తాత్రేయుడు అలర్కునకు చెప్పేడు. వినండి.
ధ్రువనక్షత్రాన్నీ, అరుంధతీ వశిష్ఠులనీ, తన శరీర చ్ఛాయను చూడలేనివాడు ఒక్క ఏడాదిలో మరణిస్తాడు. అగ్నియందు కిరణాలు కనబడడం, సూర్యుడు కిరణరహితుడై కనబడడం- పదకొండు మాసాలలో ఆ మానవుడు మరణించడానికి గుర్తు. ఎముకలు పొడుచుకు వచ్చిన బక్క ఒడలు కలవానికి ఎనిమిది నెలలలో అంత్యకాలం ప్రాప్తిస్తుంది. అడుగు వేసినపుడు కాలివ్రేళ్ళ గుర్తులు ఖండితమైనట్లు కనబడితే ఆ వ్యక్తికి ఏడు నెలలే ఆయుష్షు. కాకి, గ్రద్దా, గుడ్లగూబ నెత్తిమీద పొడిస్తే- సోకితే- వాడు ఆరు నెలల్లో విగతజీవి కాగలడు. స్నానం చేస్తున్నపుడు శరీరం అదురుతున్నవాడు అయిదు నెలల్లో అంతరిస్తాడు.
తన నీడ వేరేలాగా కనిపించినవాడు నాలుగు నెలలకు, మేఘాలు లేకుండా దక్షిణ దిక్కున మెరుపు చూసిన వాడు మూడు నెలలకూ కీడు పొందుతాడు. అద్దంలో తన బింబం తల లేకుండా కనబడినా, తన శరీరం నుండి తనకే అపరిమిత దుర్గంధం సోకినా ఆ వ్యక్తులు ఆరెనె్నలల్లో - పక్షం రోజుల్లో స్వర్గస్తులు అవుతారు.
జలకమాడినపుడు హృదయ మధ్యంలో జివ్వుమని నొప్పి కలిగినవారు ఎంత నీరు త్రాగినా దాహం తీరనివారూ పది దినాల్లో మరణిస్తారు. ఇతరుల కంటి పాపల్లో తన రూపం ప్రతిఫలించకపోయినా చెవులలో వ్రేళ్ళు పెట్టుకొని చూడగా ఏ విధమైన ధ్వనిని వినబడకున్నచో వానికి మరణం ధ్రువం.
ఇంక కలల విషయం విను.
ఎలుగుబంటి, కోతి మొదలగు జంతువులపై ఎక్కి పాటలు పాడుతూ దక్షిణ దిశకు ప్రయాణమైనట్లు; బొగ్గులు, శిరోజాలూ, ఊక మొదలగునవి భక్షించుచున్నట్లు, జైన సన్యాసి నగ్నంగా గంతులు వేస్తూ తన సమీపంలో సంచరిస్తున్నట్లు శరీరం అంతా నూనె మర్దనం చేసుకొని నేలపై నిద్రిస్తున్నట్లు, భయంకారాకారులు అస్తధ్రరులై వచ్చి తనపైన రాళ్లు రువ్వినట్లు- నలుపు వస్త్రాన్ని ధరించిన స్ర్తి దక్షిణ దిశకు వెళ్తున్నట్లు కలలు వస్తే అది అశుభం. చావు తథ్యం.
మహారాజా! ఇలాంటి అరిష్టాలు వచ్చినపుడు గురుస్మరణ, బ్రాహ్మణ వందనం, దైవార్చన, మంత్రజపం, సోమాలు, దానాలూ చేసి శాంతి చేసుకోవాలి. విష్ణుస్మరణ అన్నింటికీ నివారణమే. పైన చెప్పిన అన్ని అరిష్టాలూ శ్రీమహావిష్ణు స్మరణంతో శాంతిస్తాయి.
రాజా! సంపూర్ణ జీవితం గడిపినవారూ, తత్వరహస్య కోవిదులూ మృత్యువునకు భయపడరు. ఇంద్రియార్థాల్ని నిరసించి నదులు సముద్రంలో కలసినంత సహజంగా శరీరాన్ని విడిచి జీవుణ్ణి పరమాత్మ యందు లయం చేస్తారు’’.
గాలవుడు చెప్పిన విషయాలు విన్నాడు కుంతల దేశ చక్రవర్తి. ఆ క్షణమే ఐహిక జీవితాన్ని తృణీకరించి విరక్తుడు అయ్యేడు. మంత్రి కుమారుడైన మదనునికి అత్యవసరంగా రమ్మని కబురు పెట్టేడు.
మదనుడు ఆగమేఘాలపై వచ్చి రాజదర్శనం చేసాడు.
‘‘మదనా! నేను ఈ జీవితాన్ని రోసేను. నేను చేయవలసిన కార్యం, బాధ్యత ఒక్కటుంది. అది నా కుమార్తె వివాహం. గుణవంతుడని పరాక్రమవంతుడని పేరుమోసిన మీ చెల్లెలి మగనికే చంద్రహాసునికే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తాను. నువ్వు నిముషాల్లో చంద్రహాసుని ఇక్కడకు పంపు’’.
మదనుడు రాజాజ్ఞ తలదాల్చి సంతోషంతో ఇంటికి పయనమయ్యేడు. మార్గమధ్యంలోనే మామ చెప్పిన విధంగా పూలమాలలూ పండ్లూ చేకొని కాళికాలయానికి వెళుతున్న చంద్రహాసుడు ఎదురయ్యేడు.
- ఇంకా ఉంది

- బులుసు వేంకటేశ్వర్లు