బిజినెస్

నేడు ప్రభుత్వ బ్యాంకర్లతో అరుణ్ జైట్లీ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 22: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకుల అధిపతులతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా మొండి బకాయిలు, వడ్డీరేట్ల తగ్గింపుతోపాటు పలు అంశాలపై జైట్లీ.. బ్యాంకర్లతో చర్చించనున్నారు. అలాగే ప్రభుత్వరంగ బ్యాంకుల బలోపేతానికి ఏడంచెల వ్యూహంతో తెచ్చిన ‘ఇంద్రధనుష్’పై సమీక్ష, వృద్ధిరేటుకు దోహదపడే వివిధ రంగాలకు రుణాల పంపిణీ తదితర అంశాలూ ఈ సమావేశంలో ప్రధానంగా ప్రస్తావనకు వస్తాయని సంబంధిత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

రాబోయే రెండేళ్లలో దేశవ్యాప్తంగా మరిన్ని ఔట్‌లెట్లు
10 వేలకు పెంచుతాం: అరవింద్ లిమిటెడ్
హైదరాబాద్, నవంబర్ 22: రాబోయే రెండేళ్లలో రిటైల్ ఔట్‌లెట్లను 10 వేలకు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు ప్రముఖ ఫ్యాబ్రిక్ సంస్థ అరవింద్ లిమిటెడ్ వెల్లడించింది. తమ బ్రాండ్ ట్రెస్కా కోసం నూతన ఉత్పత్తుల ఆవిష్కరణ, మార్కెట్ పంపిణీ నెట్‌వర్క్ విస్తరణ వంటి వాటిపై దృష్టి సారించినట్లు అరవింద్ లైఫ్ స్టయిల్ ఫ్యాబ్రిక్ సిఇఒ సుశీల్‌కౌర్ ఒక ప్రకటనలో తెలిపారు. మార్కెట్లో బ్రాండెడ్ ప్రింట్ షర్టింగ్ ఫ్యాబ్రిక్‌కి మంచి ఆదరణ ఉందన్నారు. కాగా, టైర్ 2, టైర్ 3 నగరాల్లో తమ నెట్‌వర్క్‌ను విస్తరించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం 50 ఎక్స్‌క్లూజివ్ బ్రాండ్ ఔట్‌లెట్లు ఉన్నాయని, వీటి సంఖ్యను 500కి పెంచేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

మాల్యా రుణ ఎగవేతదారే: ఎస్‌బిఐ
ముంబయి, నవంబర్ 22: ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాను, ఆయనకు చెందిన రెండు సంస్థలను ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బిఐ ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులు (విల్‌ఫుల్ డిఫాల్టర్లు)గా ప్రకటించింది. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి మాల్యా నేతృత్వంలోని కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ విమానయాన సేవల నుంచి తప్పుకున్నది తెలిసిందే. ఎస్‌బిఐ నాయకత్వంలోని 17 బ్యాంకుల కూటమికి కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ దాదాపు 7 వేల కోట్ల రూపాయలు బకాయి పడింది. అయితే వీటిని చెల్లించకపోవడంతో మాల్యాతోపాటు కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్, యునైటెడ్ బ్రూవరీస్ హోల్డింగ్స్‌ను విల్‌ఫుల్ డిఫాల్టర్స్‌గా నిర్ణయించినట్లు ఎస్‌బిఐ వర్గాలు పిటిఐకి తెలిపాయి.