జాతీయ వార్తలు

ఎలాంటి అవినీతికి పాల్పడలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ

న్యూఢిల్లీ, డిసెంబర్ 21: ఢిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడుగా ఉన్నప్పుడు ఫిరోజ్‌షా కోట్లక్రికెట్ స్టేడియం నిర్మాణంలో తాను అక్రమాలకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లే దని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. జైట్లీ సోమవారం లోక్‌సభ జీరో అవర్‌లో కాంగ్రెస్ సభ్యుడు కెసి వేణుగోపాల్ తనపై చేసిన ఆరోపణలకు బదులిస్తూ తానెలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. 114 కోట్ల ఖర్చుతో 42 వేల మంది కూర్చునే స్థామర్థ్యం గల కొత్త స్టేడి యం నిర్మించడాన్ని వారు తప్పుపడుతున్నారని అన్నారు. యుపిఏ అధికారంలో ఉన్నప్పుడు జవాహర్ లాల్ నెహ్రూ స్టేడియం విస్తరణకు 900 కోట్లు ఖర్చు చేశారని, కేవలం 14 వేల మంది ప్రేక్షకులు కూర్చునేందుకు వీలున్న ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంను ఆధునీకరించేందుకు 600 కోట్లు ఖర్చు చేశారని మంత్రి ఎదురుదాడి చేశారు. స్టేడియం నిర్మాణానికి బిసిసిఐ కేవలం నాలుగు కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేసేందుకు ముందుకు వచ్చింది, ఇది స్టేడియం నిర్మాణానికి సరిపోదు కా బట్టి అదనపు నిధులను సమకూర్చుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని జైట్లీ చెప్పారు. స్టేడియం ప్రణాళికలో 43 కార్పొరేట్ బాక్సులు ప్రతిపాదించి వీటిలోని ఒక్కొక్క సీటును లక్ష రూపాయలకు ఆ సంస్థలకు పది సం వత్సరాల కోసం విక్రయించామన్నారు.
ప్రతి బాక్స్‌లో ముప్పై సీట్లు ఉండేలా రూపొందించామన్నారు. క్రికెట్ పిచ్‌కు ఉండే రెండ్ చివరలను కూడా ప్రైవేట్ సంస్థలకు విక్రయించి మొత్తం 30 కోట్ల నిధులను సమీకరించామని ఆర్థిక మంత్రి వివరించారు. ఈ దశలో 50 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేసేందుకు బిసిసిఐ ముందుకు రావటంతో మొత్తం స్టేడియంను నిర్మాంచాలనే నిర్ణయం తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.
అంతకు ముందు కాంగ్రెస్ సభ్యుడు వేణుగోపాల్ జీరో అవర్‌లో ఢిల్లీ క్రికెట్ సంఘంలో జరిగిన నిధుల దుర్వినియోగం గురించి మాట్లాడారు. అరుణ్‌జైట్లీ డిసిసిఐ అధ్యక్షుడుగా ఉన్నప్పుడు అనేక అవకతవకలు జరిగాయని, దీనిపై 2012లో సీరియస్ ఫ్రాడ్ దర్యాప్తు అధికారికి ఫిర్యాదులు అందాయని సభకు తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంపై సిబిఐ చేత దర్యాప్తు జరిపించాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు.