జాతీయ వార్తలు

నకిలీ ఆరోపణలు కొట్టుకుపోతాయి:జేట్లీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఈవీఎంల ఖచ్చితత్వాన్ని అనుమానిస్తున్న, ఎగ్జిట్ పోల్స్‌పై అంచనాలను ప్రశ్నిస్తున్న విపక్షాలపై కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ సోషల్‌మీడియాలో స్పందించారు. ఈ మేరకు ఆయన తన బ్లాగులో ఇలా రాశారు. అన్ని సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్‌పోల్స్ అన్నీ ఒకేలా ఉన్నాయని, రాబోయే ఫలితాల్లో కూడా ఇదే పునరావృతం అవుతుందని అన్నారు. వ్యక్తిగతంగా అభిప్రాయాలను తీసుకుని ఈ ఎగ్జిట్‌పోల్స్‌ను రూపొందిస్తారు. ఇందులో ఈవీఎంల పాత్ర ఏమీ ఉండదని అన్నారు. 2014లో కులతత్వపార్టీలు, అభివృద్ధికి ఆటంకాలు కల్పించే పార్టీలు, రాజవంశ పార్టీలు ఓటమి పాలయ్యాయి. 2019లోనూ ఇదే పరిస్థితి పునరావృతం అవుతుందని అన్నారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న నకిలీ ఆరోపణలు సైతం కొట్టుకుపోతాయని అన్నారు. ఓటర్లు చాలా స్పష్టతతో ఉన్నారని అన్నారు.