జాతీయ వార్తలు

మంత్రుల భేటీలో తొలగని ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దిల్లీ: నదీజలాల పంపకంపై ఉభయ తెలుగురాష్ట్రాల మధ్య రాజీ కుదరలేదు. ఇక్కడ గురువారం ఉదయం కేంద్ర జలవనరుల శాఖ ప్రత్యేక కార్యదర్శి అమర్‌జీత్ సింగ్ సమక్షంలో ఎపి, తెలంగాణ ఇరిగేషన్ మంత్రులు దేవినేని ఉమా, హరీష్ రావు భేటీ అయినప్పటికీ ప్రతిష్టంభన తొలగిపోలేదు. మంత్రులిద్దరూ ఏకాభిప్రాయానికి రానందున సమావేశం అర్ధంతరంగా ముగిసింది. నీటి పంపకాలపై ఒక కమిటీని నియమించి అధ్యయనం చేస్తామని కేంద్రం స్పష్టం చేసినట్లు సమాచారం. ఎపి ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ హక్కుల సాధనకు అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళతామని హరీష్ రావు చెప్పారు. విభజన చట్టం ప్రకారం నీటి వాటాలను తేల్చాలని దేవినేని ఉమా పట్టుబట్టారు.