జాతీయ వార్తలు

50మంది జామియా విద్యార్థులు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిన్న దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలకు సంబంధించి అరెస్టు చేసిన జామియా యూనివర్శిటీ విద్యార్థులను ఈరోజు విడుదల చేశారు. ఆగ్నేయా ఢిల్లీలోని జామియా యూనివర్శిటీ విద్యార్థులు పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా చేసిన ఆందోళనలు హింసాత్మకంగా మారిన విషయం విదితమే. పౌరసత్వ చట్ట వ్యతిరేక ఆందోళనలు ఆదివారం ఢిల్లీని అట్టుడికించాయి. ఇప్పటివరకు ఈశాన్యానికే పరిమితమైన ప్రదర్శనలు, ధర్నాలు రాజధానిని తాకాయి. పోలీసులు, ఆందోళనకారులకు మధ్య జరిగిన ఘర్షణల్లో అనేక మంది గాయపడ్డారు. నాలుగు బస్సులను ఆందోళనకారులు దగ్ధం చేశారు.