జాతీయ వార్తలు

జమ్మూకాశ్మీర్‌లో దారుణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: సవతి తల్లి అసూయకు అమాయకురాలైన ఆ చిన్నారి బలైంది. జమ్మూకాశ్మీర్‌లో ఓ బాలికపై జరిగిన లైంగిక దాడి అనంతరం పాశవిక హత్య పోలీసులను నివ్వెరపరిచేలా చేసింది. బారాముల్లా జిల్లా యూరీ అటవీ ప్రాంతంలో ఓ బాలిక మృతదేహం కనిపించటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఈ బాలిక మృతిపై దర్యాప్తు చేపట్టగా విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. ఈ బాలిక తండ్రికి రెండవ భార్య కుమార్తె. తన భర్త ఎక్కువ సమయం రెండవ భార్య, పిల్లలతో ఉంటున్నాడని అసూయ పెంచుకున్న మొదటి భార్య ఈ చిన్నారిని గత ఆదివారం తనతో పాటు సమీపంలోని అడవికి తీసుకువెళ్లింది. అక్కడ తన 14 సంవత్సరాల వయసు ఉన్న కుమారుడితో ఆ బాలికపై అత్యాచారం చేయించింది. తరువాత తన కుమారుడి స్నేహితులను మరో ముగ్గురుని పిలిపించి వారిచేత కూడా అత్యాచారం చేయించింది. తరువాత ఆ బాలిక తలను నరికి, కళ్లు పేకేసి పెట్రోల్ పోసి తగులబెట్టించింది. పోలీసులు విచారణలో తేలిని ఈ నిజాలు పోలీసులను నిర్ఘాంతపోయేలా చేసింది. పోలీసులు సవతి తల్లిని, కుమారుడిని, స్నేహితులను అరెస్టు చేశారు.