జాతీయ వార్తలు

అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైందే:గవర్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూకాశ్మీర్: అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైందేనని గవర్నర్ సత్యపాల మాలిక్ తన చర్యను సమర్థించుకున్నారు. ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ కలిసి, కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చిన నేపథ్యంలో సత్యపాల్ మాలిక్ గురువారం మీడియాతో మాట్లాడుతూభావసారుప్యత లేని పార్టీలు స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేవని, ఎమ్మెల్యేలకు డబ్బు ఎర చూపటం, పెద్ద ఎత్తున ముడుపులు అందటం వంటి చర్యలకు పాల్పడతారనే అసెంబ్లీని రద్దు చేసినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా పీడీపీ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తానని ముందుకు వచ్చిన విషయం విదితమే. ఇదే సందర్భంలో ఇద్దరు సభ్యులు ఉన్న పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సాజిద్ లోన్ కూడా తాను బీజేపీ, ఇతరుల సాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తానని ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎవరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీని రద్దు చేస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు.