కృష్ణ

జన చైతన్య యాత్రల్ని జయప్రదం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాయకాపురం, నవంబర్ 27: డిసెంబర్ 1వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరగనున్న జన చైతన్య యాత్రలను జయప్రదం చేయాలని, అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షఏమ కార్యక్రమాలను ప్రజల్లోకి పెద్ద ఎత్తున తీసుకువెళ్లాలని, శాసన సభ్యులు, ఇన్‌చార్జిలు తప్పక అన్ని రోజుల్లో జన చైతన్య యాత్రల్లో పాల్గొనే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని జిల్లా ఇంచార్జ్ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం మంత్రి పుల్లారావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు తెలుగుదేశం పార్టీ గ్రామ, మండల, నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాల పై సమీక్షించారు. వివిధ స్థాయిలో జరుగుతున్న అభివృద్ది, సంక్షేమాల తీరును నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. శాసన సభ్యులు, ఇన్‌చార్జిలు వారి నియోజకవర్గాల్లోని సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకురాగా వాటిని పరిష్కరించే విధంగా అధికారులకు మంత్రులు సూచనలిచ్చారు. మంత్రి దేవినేని మాట్లాడుతూ జిల్లాలోని శాసనసభ్యులు, ఇంచార్జ్‌లు, ముఖ్య నాయకులు విధిగా ప్రతి నెల 9వ తేదీ గ్రామ కమిటీ సమావేశాలు, 14వ తేదీన మండల పార్టీ సమావేశాల్లో పాల్గొనాలని, రాష్ట్ర పార్టీ ఇచ్చిన కేలండర్ ప్రకారం ప్రతి నెల 18వ తేదీన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశాలు నిర్వహించి, సమస్యలను తీర్మానం రూపంలో జిల్లా పార్టీ కార్యాలయానికి పంపాలని కోరారు. సమావేశం అనంతరం జన చైతన్య యాత్ర ముద్రించిన కరపత్రాలు, స్టిక్కర్లు, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పై రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించి అన్ని నియోజకవర్గాలకు పంపిణీ చేశారు.

నీటి సరఫరాకు చైనా, జపాన్ సంస్థల ప్రణాళికలు
విజయవాడ , నవంబర్ 27: రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో ప్రజల వౌళిక వసతుల అభివృద్ది, నిరంతర నీటి సరఫరాకు విస్తృత చర్యలు తీసుకొంటున్నామని విఎంసి కమిషనర్ వీరపాండియన్ పేర్కొన్నారు. ప్రస్తుతం అందిస్తున్న నీటి సరఫరాకు తోడుగా మెరుగైన సౌకర్యం కోసం చేయూత నిచ్చేందుకు ముందుకు వచ్చిన చైనా జపాన్ దేశాలకు చెందిన సంస్థల ప్రతినిధులతో శుక్రవారం తన ఛాంబర్‌లో విడి విడిగా కమిషనర్ వీరపాండియన్ చర్చించారు. ఈ సందర్భంగా ఆయన జపాన్ దేశ సంస్థ ఎన్‌ఐఐపి సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతూ విస్తరిస్తున్న నగర పరిసర ప్రాంతాలు, పెరుగుతున్న జనాభాకనుగుణంగా సరఫరా మెరుగు తోపాటు భూగర్భ మురుగు పారుదల విషయమై ఆయన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ చేసారు. అందుకు స్పందించిన జపాన్ సంస్థ ప్రతినిధులు ఈవిషయమై తాము ఉచితంగా ప్రణాళికలు సిద్దం చేసి అందిస్తామని హామీ ప్రకటించారు. అనంతరం విధ్యాధరపురంలోని హెడ్ వాటర్ వర్క్స్ ను పరిశీలించిన ప్రతినిధులు అక్కడ జరుగుతున్న నీటి శుద్ది చర్యలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఇఇ గోవిందరావు, డిఇఇ నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
చైనా ప్రతినిధులతో
నగర నీటి సరఫరా విధానంపై చైనా దేశ సంస్థ అయిన జిఐఐసి ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో సంస్థ ప్రతినిధులు తాము చేపట్టబోయే విధి విధానాలపై కమిషనర్ వీరపాండియన్‌కు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.