తెలంగాణ

జిల్లాల విభజన పేరిట గందరగోళం: జానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జిల్లాల విభజన పేరిట ప్రస్తుతం తెలంగాణలో తీవ్ర గందరగోళం నెలకొందని సిఎల్‌పి నాయకుడు జానారెడ్డి అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ, ప్రజల ఆకాంక్షలు, చారిత్రక నేపథ్యం ప్రాతిపదికగా జిల్లాల విభజన జరగాలన్నారు. ఎన్నికలకు ముందు, అధికారం చేపట్టాక సిఎం కెసిఆర్ ఇచ్చిన హామీలు అమలు జరగడం లేదని ఆరోపించారు. కెజి నుంచి పిజి విద్య, డబుల్ బెడ్‌రూం ఇళ్లు, మైనార్టీలకు రిజర్వేషన్లు వంటి హామీలు అమలుకావడం లేదన్నారు. హామీలను మరచిన పాలకులను నిలదీసేందుకు యువత చైతన్యవంతం కావాలన్నారు. ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన సాగడం లేనందున తెరాస ప్రభుత్వాన్ని అసెంబ్లీ వేదికగా తాము నిలదీస్తామన్నారు.