Others

చారిత్రక అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఏంటి రామయ్యా ఆఫీసుకు దగ్గరగా ఉందని, మీ మెస్‌కు వస్తున్నాం, రోజు రోజుకు కూరల రుచి తగ్గిపోతోంది. ఉప్పు ఎక్కువేసినట్టున్నావ్! రోజూ కూరలు గడ్డితింటున్నట్టుగా ఉన్నాయ్! ఉప్పు ఎందుకెక్కువ వేశావ్!’’
‘‘కూరలో ఉప్పు ఎక్కువేయడం చారిత్రక అవసరం బాబూ అవసరం. అంతే కానీ కూర వండలేక కాదు బాబు వండలేక కాదు. ’’
‘‘ఆయనెవరో మంతెన ఉప్పు తక్కువ వేయమన్నాడు కానీ ఎక్కువ వేయడం, అదేం చారిత్రక అవసరం. చెప్పిన మాటే బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లో డైలాగుల్లో రెండేసి సార్లు చెబుతావేం’’
‘‘చారిత్రక అవసరం అంటే చారిత్రక అవసరమే బాబు ఇంతకు మించి చెప్పలేం’’
‘‘ఏం చేస్తాం మాకున్న అరగంట టైమ్‌లో ఇక్కడికి తప్ప ఎక్కడికీ వెళ్లలేం. ఈడికి రావడం మాకు చారిత్రక అవసరం. ’’
***
‘‘రాధా! నువ్వు నన్ను మరిచిపోవాలి రాధా’’
‘‘అదేంటి రాజా! మీ ఊరెళ్లి మన పెళ్లికి మీ పెద్ద వాళ్ల పర్మిషన్ తీసుకుని వస్తానని చెప్పావ్! ఇప్పుడేంటి రాజా అలా అంటున్నావు’’
‘‘నన్ను అర్థం చేసుకో రాధా! మనం విడిపోవడం చారిత్రక అవసరం. నా చదువు కోసం మా అమ్మానాన్నలు తమ జీవితమంతా ధారపోశారు. వాళ్లు చెప్పినట్టు మా మేనమామ కూతురును చేసుకోవడం చారిత్రక అవసరం. ’’
‘‘మేనమామ కూతురు ఇప్పటికిప్పుడు పుట్టలేదు కదా? రాజా! ఎప్పుడో పుట్టి ఉంటుంది కదా? అలాంటప్పుడు ననె్నందుకు ప్రేమించావు ’’
‘‘కాలేజీలో చదువుకునేప్పుడు నిన్ను ప్రేమించడం చారిత్రక అవసరం రాధా’’
‘‘నా వెంట పడ్డా నిన్ను పట్టించుకోక పోతే బ్లేడ్‌తో చేయి కోసుకున్నావ్! రక్తంతో ప్రేమలేఖ రాశావు’’
‘‘రక్తంతో ప్రేమలేఖ రాయక పోతే నువ్వు నన్ను పట్టించుకునే దానివా? అదప్పుడు చారిత్రక అవసరం రాధా’’
‘‘చదువుకునే రోజుల్లో సరదా కోసం ప్రేమించావు, చదువు ముగిసి ఉద్యోగం వచ్చాక ఆస్తి కోసం మరదలిని పెళ్లి చేసుకుంటున్నావ్! సరదా కోసం ఒకరు పెళ్లి కోసం ఒకరు ఇలా ఎందరి జీవితాలను నాశనం చేస్తావ్ రాజా!’’
’’చూడు రాధా! అప్పటి చారిత్రక అవసరం కోసం నిన్ను ప్రేమించాను. ఇప్పటి చారిత్రక అవసరం కోసం మరదల్ని పెళ్లి చేసుకుంటున్నాను. చారిత్రక అవసరాలను అర్థం చేసుకోకపోతే అది నీ ఖర్మ. నేను వ్యక్తులు, బంధాలు, స్నేహాల కన్నా చారిత్రక అవసరాలకే ప్రాధాన్యత ఇస్తాను. నా జీవితం చారిత్రక అవసరాలకు అంకితం’’
***
‘‘హీరోయిన్ గారూ ఆ కాలంలో ఆ హీరోగారు మీతో అభ్యంతరకరంగా వ్యవహరించారు కదా? ఇంత కాలం వరకు ఆ సంగతి ఎందుకు బయట పెట్టలేదు.?’’
‘‘అప్పటి చారిత్రక అవసరం వల్ల వౌనంగా ఉండాల్సి వచ్చింది. ఇప్పటి చారిత్రక అవసరం వల్ల బయట పెట్టాల్సి వచ్చింది. చారిత్రక అవసరాన్ని బట్టే నిర్ణయం తీసుకుంటాం . ఇందులో నా స్వార్థం ఏమీ లేదు.’’
***
‘‘ఏరా! సుబ్బారావు రాహుల్ గాంధీ పెళ్లి ఎందుకు చేసుకోలేదంటావ్?’’
‘‘దానికో చారిత్రక నేపథ్యం ఉంది.’’
‘‘ఏంటో అది. బ్రహ్మచారి ఈ దేశాన్ని పాలిస్తాడని బ్రహ్మంగారేమన్నా చెప్పారా? ’’
‘‘బహుశా జాతకాలు కలవలేదేమో? అసలే దేశంలో ఉత్తరాది, దక్షిణాది అనే వాదన మొదలైంది. అదీ కాకుండా ఏ సామాజిక వర్గం వారిని చేసుకోవాలో మరో సమస్య. అసలే రాజకీయాల్లో ఉన్నారు. ఎందుకొచ్చిన సమస్య అని చారిత్రక అవసరాల కోసం పెళ్లి చేసుకోలేదు’’
‘‘పెళ్లి ఎందుకు చేసుకున్నావంటే చారిత్రక ఆవశ్యకతలు చెప్పే చరిత్రలు చాలానే ఉన్నాయి కానీ చివరకు పెళ్లి చేసుకోకుండా ఉండేందుకు కూడా చారిత్రక అవసరాలుంటాయా?’’
‘‘ఏమేవ్ బుర్ర వేడెక్కింది కాస్త టీ ఇస్తావా?’’
‘‘ఇవ్వను’’
‘‘ఏం?’’
‘‘పాలు లేవు. స్టౌమీద పాలు పెట్టి, పక్కింటి వారి ముచ్చటలు ఉండగా పాలన్నీ ఆవిరయ్యాయి’’
‘‘అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావ్?’’
‘‘ఏవో చారిత్రక అంశాలు ఉంటాయి అన్నీ చెప్పాలా?
ఓ రెండు వారాల క్రితం ఆ రెండు పార్టీలు కలిస్తే ఉరేసుకుంటానన్న పెద్దాయన కూడా రెండు పార్టీలు కలవడం చారిత్రక అవసరం అంటున్నాడు. మేమంటే తప్పా?’’
***
‘‘న్యూస్ చానల్స్ రాకుండా ఆపేయడం చారిత్రక అవసరం లేదంటే నాయకుల డైలాగులు ఇంటి వరకు వస్తాయి. ఇదిగో కేబుల్ ఆపరేటర్ వెంటనే మా ఇంటి కెబుల్ కనెక్షన్ కట్ చేయ్’’
‘‘ఎందుకు సార్?’’
‘‘చారిత్రక అవసరం’’

buddhamurali2464@gmail.com