జనాంతికం - బుద్దా మురళి

చిదంబర సందేశం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఈ లోకంలో అధికారం ఉన్నవాడు చెబితే రైట్, అధికారం పోయినవాడు చెబితే నవ్వులాటగా ఉంటుంది’’
‘‘ఏమైంది? ఇప్పుడు నువ్వేం చెప్పావు? ఎవరు నవ్వారు?’’
‘‘నాకేమైనా అధికారం ఉందా? ఇప్పుడు పోవడానికి. నా గురించి కాదు. నేనెప్పుడూ నా గురించి ఆలోచించను. లోకం తీరు గురించి ఆలోచిస్తాను’’
‘‘నీ విశాల హృదయం నాకు తెలుసులే! ఓహో.. ఆర్టికల్ 370ని తీసి అవతల పారేసిన తరువాత కశ్మీర్‌లో బాంబుల వర్షం కురిసి, ఆ వరదలో దేశం కొట్టుకు పోతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నట్టున్నావ్! అదేదీ జరగకపోవడంతో తీవ్రంగా నిరాశ పడ్డట్టున్నావ్! నువ్వే కాదులే! యూ ట్యూబ్‌లో కొన్ని వీడియోలు చూశాను. ఇప్పటికిప్పుడు ఇండియాపై దాడి చేయాలని, హిందువులను చంపేయాలని కొందరు చాలా గట్టిగా వాదిస్తున్నారు. బూతులు తిడుతున్నారు. కానీ కొందరు మాత్రం నీలానే తీవ్ర నిరాశ పడుతున్నారు. పాక్ అంటేనే చిప్పపట్టుకుని దేహీ అంటూ తిరిగే దేశంగా ప్రపంచం చూస్తుంది. ఇక మనకు అండగా ఎవరుంటారు? దేశం అసలే క్లిష్టపరిస్థితిలో ఉంది. అమెరికా చేయి అందిస్తే తప్ప రోజులు గడిచేట్టుగా లేవు. ఇప్పటికిప్పుడు ఇండియాపై ప్రతీకారం తీర్చుకోలేక పోయినా పది పదిహేనేళ్ల తరువాత ఐ నా అప్పటి యువత ఎ దిగి పాక్‌పై ప్రతీకారం తీర్చుకుంటుందని లండన్‌లో స్థిరపడిన పాక్ ప్రొఫెసర్ ఒకావిడ చాలా బాధపడుతూ చెప్పింది’’
‘‘నేనా విషయం ఆలోచించడం ఎప్పుడో మా నేశా..’’
‘‘మరి దేని గురించి?’’
‘‘ఒకే విషయం మనకు నచ్చిన వారు చెబితే ఆహా- ఓహో అంటాం. అదే నచ్చని వారు చెబితే నవ్వులాటగా ఉంటుంది’’
‘‘ఔను- లోకం తీరే అంత..’’
‘‘ఆయనెవరో మహారుషికి కోపం వస్తే సముద్రాన్ని కమండలంలో బంధించాడని అంటే నమ్మామా? లేదా?’’
‘అది పురాణం’’
‘‘ఏదైతేనేం.. నమ్మాం, సముద్రాన్ని కమండలంలో బంధించినట్టు సినిమాల్లో చూపిస్తే తన్మయత్వంతో చూశాం. కానీ నాటుపడవలతో వరదలు తెప్పించవచ్చు అన్నా, కాగితపు పడవలతో వరదలను నిలిపివేవచ్చు అని ఎవరైనా చెబితే నీకు నవ్వులాటగా ఉంటుంది’’
‘‘ఓహో నువ్వు చెబుతున్నది అమరావతిలో వరదల గురించా? వరదలు వస్తే రాజధాని ము నుగుతుంది, సురక్షి తం కాదు.. అని నిపుణుల కమిటీ ఎప్పుడో చెప్పిం ది కదా?’’
‘‘నిపుణులకేంటి? మ నం ఏది చెప్పమంటే అది చెబుతారు. కానీ రామలక్ష్మణులు లేనప్పుడు రావణాసురుడు సీతను ఎత్తుకెళ్లినట్టు- నాయకులు స్థానికంగా లేనప్పుడు దొంగచాటుగా అలా వరదలు తెప్పించడం న్యాయమా? ఇది ధర్మయుద్ధమే అంటావా? ఈ కుట్రను ముందే గ్రహించడం వల్ల సరిపోయింది కానీ లేకపోతే ?’’
‘‘నిజంగా చెబుతున్నాను. వరదలు ఎందుకు వస్తాయో ఎప్పుడు వస్తాయో, కమండలంలో సముద్రాన్ని బంధించ వచ్చో లేదో, ముఖం కడుక్కుని నల్లాను కట్టేయక పోతే వరదలు వస్తాయో లేదో నాకస్సలు తెలియదు. తెలియని విషయాల గురించి నేను మాట్లాడను’’
‘‘అంతేలే! మీ కుట్రలు కాస్త బయటపడితే అలానే అంటారు’’
‘‘కుట్ర అంటే గుర్తుకు వచ్చింది. తుమ్ కిత్నాబీ కుట్రా కరో అంటూ ఆ మధ్య తెలుగు మహిళా నాయకురాలు మోదీపై వీరోచితంగా దాడికి దిగారు కదా? అదేంటోయ్ ఇలా జరిగింది. తీరా ఆమె కమలం పార్టీలోకి వెళ్లింది. అంతేలే! మహాభవనం అనుకున్నది కాస్తా కాగితం పడవ అని తేలాక ఎవరికి వారు పారిపోయి కాపాడుకోవడం సహజమే! ’’
‘‘నువ్వెన్నయినా చెప్పు! మా బాబు మా బాబే.. అని ఈగవాలినా సహించం అంటూ వీరంగం వేసిన వారంతా ఒకరి తరువాత ఒకరు తప్పుకోవడం చూస్తుంటే’’
‘‘మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా? కట్టుకున్న వాళ్లు కూడా కాటి వరకే వస్తారని, అంతకు మించి దూరం రారని చెబితే ఏదో వేదాంతం అనుకున్నాం కానీ నిజమే. జీవిలో జీవుడు ఉన్నంత వరకే గౌరవిస్తాం, ప్రేమిస్తాం, నువ్వు లేనిదే బతకలేం అంటారు. జీవుడి నుంచి జీవుడు పోయాక కాటివరకు రావడమే గొప్ప. జీవుడికి జీవి లాంటిదే నాయకుడికి అధికారం. అది పోయాక వెంట ఉండడానికి వాళ్లేమైనా అమాయకులా! నాయకులు’’
‘‘అంతేలే! రాజే బంటవును.. బంటు రాజవును అని పెద్దలు ఎప్పుడో చెప్పారు’’
‘‘రాజరికంలో అంటే దాచుకోవడానికి బ్యాంకులు, విదేశీ ఖాతాలు ఉండవు కాబట్టి శత్రుదేశ రాజు దాడి చేసి దేశాన్ని స్వాధీనం చేసుకుంటే రాజు బంటవుతాడేమో! కానీ ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ రాజు బంటు కానే కాడు. సంపాదించిన డబ్బును కాపాడేందుకు బినామీలు ఉంటారు. విదేశీ బ్యాంకులు ఉంటాయి. మళ్లీ వచ్చే ఎన్నికల్లో మనదే అధికారం అని ఆశగా ఐదేళ్ల కాలం గడిచిపోవడం గురించి ఆలోచిస్తారు. కానీ మరీ రోడ్డున పడరు’’
‘‘అది కాదు. పాపం చిదంబరం పరిస్థితి చూసి రాజు బంటు కావడం గురించి గుర్తుకు వచ్చింది. పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మడం అంటే ఇదేనేమో’’
‘‘ఈ లోకంలో చేసిన తప్పులకు ఇక్కడే శిక్ష అనుభవించాలి కదా?’’
‘‘ఔననుకో.. కానీ చిత్రంగా చిదంబరం గతంలో అధికారంలో ఉన్నపుడు ఢిల్లీలో సిబిఐ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఇప్పుడు అదే కార్యాలయంలో ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఇంత కన్నా ఘోరం ఇంకేముంటుంది’’
‘‘ఈయన హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్‌షాను అరెస్టు చేయించారు. ఇప్పుడు అమిత్‌షా హోంమంత్రిగా ఈయన్ని అరెస్టు చేయించారు. చరిత్ర పునరావృతం అన్నట్టు అరెస్టులు పునరావృతం అవుతున్నాయి. కింది నుంచి పైకి వెళ్లడం ఈజీ కానీ, శిఖరాగ్రానికి చేరి ఇలా దబేల్ మని కిందకు పడిపోవడాన్ని జీర్ణం చేసుకోవడం అంత ఈజీ కాదు.’’
‘‘చిదంబరం తరువాత ఎవరు? అనే మాట బాగా వినిపిస్తోంది.. ఎవరంటావు?’’
‘‘నేనే..’’
‘‘అదేంటి? నువ్వంత పెద్ద నేరం ఏం చేశావ్?’’
‘‘ఏదో సరదాగా అన్నాను. కానీ నువ్వనుకుంటున్నావని మాత్రం తరువాత వరుసలో ఉండే అవకాశమే లేదు’’
‘‘???’’
‘‘నీ మూడు ప్రశ్నల వెనుక భావం తెలుసు.. కానీ సూటిగా చెప్పను. అదంతే.. కవచ కుండలాలు ఉన్నంత వరకు పాండవులు కర్ణుడిని ఓడించ లేకపోయారు. ’’
‘‘అర్థం కాలేదు’’
‘‘మొసలిని నీటిలో ఉండగా ఓడించలేరు. వాలిని ముందు నుంచి ఎదిరించ లేరు. కొందరిని అరెస్టు చేయలేరు. అంతే’’
‘‘చిదంబరం ఉదంతం ఏం చెబుతుందని అంటావు?’’
‘‘ఏది ఏమైనా అధికారంలో ఉన్నప్పుడు జైళ్లలో సౌకర్యం మెరుగు పరచాలన్నదే చిదంబర సందేశం!..’’
*

buddhamurali2464@gmail.com