జనాంతికం - బుద్దా మురళి

..మధ్యలో ఇండియా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘చెప్పినా వినకుండా... సర్వనాశనం చేస్తున్నారు...’’
‘‘ఏం జరిగిందోయ్...?’’
‘‘మన జీడీపీ ఎంతో తెలుసా? టాటా కార్ల ఫ్యాక్టరీలను రెండు రోజులు మూసేశారన్న సంగతైనా తెలుసా? పార్లే-జీ బిస్కట్లు తింటున్నావా? ఆ ఫాక్టరీలో పదివేల మంది ఉద్యోగులను తొలగించారన్నది తెలుసా?’’
‘‘చూడోయ్.. నాకు ఏ నెల జీతం ఆ నెలకే సరిపోవడం లేదు. మా అ బ్బాయి కారు కొందామని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ మహానగరంలో కారైనా, సైకిలైనా ఒకటే స్పీడ్.. హాయిగా మెట్రోరైలెక్కి పోకుండా కారెందుకు రా.. అని నచ్చజెప్పా. కారు తీసుకొని మోండా మార్కెట్‌కు వెళ్లినా, మహంకాళి గుడికెళ్లినా నరకమే! ఎక్కడా పార్కింగ్‌కు అవకాశం లేదు. నడుచుకుంటూ వెళ్లడమే నయం. నామాట విను.. నువ్వు కూడా కారు కొనకు.. హాయిగా బస్సులోనో, మెట్రోలోనో వెళ్లు. మరీ అంతగా కారెక్కాలని అనిపిస్తే ఊబర్ టాక్సీ బుక్ చెయ్’’
‘‘నేనేం చెబుతున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావ్?’’
‘‘అదే లేవోయ్.. టాటా కార్ల ఫ్యాక్టరీని రెండు రోజులు మూసేశారన్నావ్.. అదే కదా? ఈరోజు కొనాలనుకున్నది మరో రెండు రోజుల తరువాత కొంటావేమో? అంతోటి దానికి ఇంత ఆవేశం, ముఖంలో ఇన్ని రూపాలు మార్చడం అవసరమా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్?’’
‘‘ఆ.. పార్లే బిస్కట్ల గురించే కదా? ఈ కాలం పిల్లలంతా పిజ్జాలు, బర్గర్‌లు అంటూ జపిస్తుంటే నువ్వేమో ఇంకా పాతకాలం వాడిలా పార్లే బిస్కట్ల కోసం ఇంతగా తపిస్తున్నావంటే.. నువ్వు గ్రేట్‌రా!’’
‘‘ఎహే ఆగు.. ఇంత అజ్ఞానంతో మనుషులు ఎలా ఉంటారో అర్థం కావడం లేదు. నేను పడిపోయిన జీడీపీ గురించి, తగ్గిపోయిన గ్రోత్ రేట్ గురించి, ఆగిపోయిన పరిశ్రమల గురించి.. ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతుంటే- నువ్వేంటి.. సిల్లీగా బిస్కట్లు, చాక్లెట్లు అంటూ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నావ్!’’
‘‘చెప్పుకుంటే సిగ్గుచే టు కానీ, ఆర్థిక సంక్షోభం అంటే ఏంటి? అంతా దా నిపై తెగ మాట్లాడేస్తున్నా రు. మన చిన్నప్పుడు స్కై లాబ్ పడిపోయి ప్రపం చం అంతా భస్మీపటలం అవుతుందని తెగ భయపడేవారు. ఇప్పుడలాంటిదేమన్నా భూగోళానికి ముప్పుగా మారిందా?’’
‘‘అంతకన్నా పెద్ద ముప్పు! ప్రపంచానే్న గడగడలాడిస్తోంది..’’
‘‘ఫేస్‌బుక్‌లో చూశా.. ఆంధ్రపదేశ్‌లో బాబు ఓడిపోయి జగన్ గెలవడం వల్ల, బాబుకు మద్దతు ఇచ్చే మీడియాను కాదని, జగన్‌కు మద్దతు ఇచ్చే మీడియా వల్లనే ప్రపంచానికి ఈ ప్రమాదం ముంచుకొచ్చిందని కొందరు రాశారు. అస్సలు అర్థం కాలేదు. మరీ బడాయి కాకపోతే జగన్‌కు ఆంధ్రలో బలం ఉంది నిజమే, ప్రపంచాన్ని గజగజలాడించేంత బలం ఉందంటావా?’’
‘‘ఎహే.. జగన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి ప్రపంచం ఆర్థిక సంక్షోభం బాట పట్టింది’’
‘‘అంటే- బాబు వల్లనే ప్రపంచానికి ఆర్థిక సంక్షోభం అంటావా?’’
‘‘అబ్బా- నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ప్రపంచంలో ఏం జరిగినా ఐతే బాబు లేదంటే జగన్.. ఆ ఇద్దరి వల్లనే అంటావా? నీకు వీళ్లే ప్రపంచంలా కనిపిస్తున్నారా? ప్రపంచం వీరిద్దరి కార్యక్షేత్రాల కన్నా పెద్దగా ఉంటుంది.’’
‘‘ఔను.. మోదీ వల్లనే అని బాగా ప్రచారం జరుగుతోంది. మోదీ వల్ల ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడుతుందా? ఆయనెవరో- శివసేన నాయకుడు ఇప్పటికైనా మన్మోహన్ సింగ్‌ను పిలవండి, ఆయన సలహాలు తీసుకుని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడండని సలహా ఇచ్చినట్టు ఉన్నాడు. ప్రపంచాన్ని రక్షించేంత సత్తా మన దేశానికి చెందిన నాయకుడికి ఉండడం గర్వకారణం. ఆయన ఏ పార్టీ ఐనా కానీ, ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసింది మా సింగ్ గారే అని చెప్పుకోవడం మనకెంత గర్వకారణంగా ఉంటుంది?’’
‘‘నీకు ఆర్థిక అంశాల గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది’’
‘‘చిన్నప్పుడు జేమ్స్‌బాండ్ సినిమాలు చాలా చూశా. ప్రపంచం సంక్షోభంలో పడిపోయినప్పుడు జేమ్స్‌బాండ్ అందమైన అమ్మాయితో కలిసి సాహసాలు చేసి ప్రపంచాన్ని రక్షిస్తాడు. హాలివుడ్ వాళ్లు సినిమాల్లో మాత్రమే ప్రపంచాన్ని రక్షించారు. కానీ మా సర్దార్జీ నిజంగా ప్రపంచాన్ని రక్షించాడని చెప్పుకోవడం ఎంత గర్వంగా ఉంటుంది’’
‘‘నీకు విషయం అర్థం కావడం లేదు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది. అంటే డబ్బులకు కటకట అన్నమాట’’
‘‘వావ్- ఎంత మంచి మాట చెప్పావురా! నెలాఖరులో మనం డబ్బులకు కటకటలాడుతాం. చివరి మూడు రోజులు టీ, టిఫిన్‌లకు కూడా డబ్బులుండవు. అంటే దేశాలు కూడా మనలాంటి వేతన జీవులే అన్నమాట. ఖర్చుకు డబ్బు లేక కటకటలాడుతున్నాయి.’’
‘‘అది కాదు.. జీడీపీ అని ఒకటుంటుంది లే! మన జీడీపీ పాకిస్తాన్ కన్నా తక్కువ. బంగ్లాదేశ్ జీడీపీ 8 శాతం, నేపాల్ 7.9, భూటాన్ 7.4 పాకిస్తాన్ 5.4 కానీ- ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 5 శాతమని తెలుసా?’’
‘‘వాట్సాప్‌లో ఈ ప్రచారం చూశాను. నీకో మంచి ఐడియా ఇవ్వా లా?’’
‘‘ఇవ్వు.. ’’
‘‘మీ అబ్బాయిని అమెరికా లేదా కెనడా పంపించాలని తెగ ప్రయత్నిస్తున్నావు. అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నావు కదా? ఆ ప్రయత్నాలన్నీ మానేయ్’’
‘‘ఎందుకు?’’
‘‘అమెరికా వెళ్లాలంటే అరకోటి ఖర్చు. ట్రంప్ అక్కడ ఉండనిస్తాడో వెనక్కి పంపుతాడో తెలియక రోజూ టెన్షన్‌తో చావాలి. పైగా అమెరికా జీడీపీ 3శాతమే. అదే నేపాల్‌కో, పాకిస్తాన్‌కో పంపించావనుకో ఎనిమిది శాతం జీడీపీ. మన రూపాయికి అక్కడ రెండు రూపాయిలిస్తారు. రైలులో వెళ్లి పోవచ్చు. ఏమంటావ్?’’
‘‘ఏం చెప్పదలుచుకున్నావ్..’’
‘‘ప్రతి విషయం మీద మనం మాట్లాడొద్దు. సాహో సినిమా గురించి మాట్లాడడం వేరు. ఆర్థిక సంక్షోభం, జీడీపీ వంటి విషయాలు వేరు. ఇదేమీ రెండు గంటల సినిమా కాదు. ఆ రంగంలో నిపుణులు చెప్పింది విందాం. తెలియని దాని గురించి ఏదో అయిపోతుందని ప్రచారం చేయకు. ఈ దేశానికి సంక్షోభాలు కొత్త కాదు. ఎదిరించి నిలబడింది. నిలబడుతుంది. భవిష్యత్తు మనదే.

buddhamurali2464@gmail.com