ఆంధ్రప్రదేశ్‌

జనసేన మద్దతు కోరిన టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ:ఏపీ ప్రభుత్వ ఇసుక విధానాన్ని నిరసిస్తూ టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న దీక్షకు జనసేన మద్దతును టీడీపీ కోరింది. ఈ మేరకు ఈ రోజు ఉదయం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను విజయవాడలోని ఆయన స్వగృహంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య కలిశారు. ఇసుక కొరతపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు రేపు చేపట్టనున్న దీక్షకు జనసేన మద్దతు కోరారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ దీక్షకు మద్దతు ఇచ్చే విషయమై పవన్ సానుకూలంగా స్పందించారన్నారు.