రాష్ట్రీయం

మళ్లీ.. జన్మభూమి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉవ్విళ్లూరుతున్న చంద్రబాబు
అధికారులకు సూత్రప్రాయంగా వెల్లడి
వచ్చే జనవరి నుంచి ప్రారంభం?

హైదరాబాద్, నవంబర్ 28: తెలుగు దేశం పార్టీకి ప్రతిష్ఠాత్మకమైన జన్మభూమిని మరోసారి తెరపైకి తెచ్చేందుకు చంద్రబాబు యోచిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహించినట్టుగానే నవ్యాంధ్రలోనూ జన్మభూమిని మరోమారు నిర్వహించేందుకు సిఎం చంద్రబాబు ఉవ్విళ్లూరుతునట్టు తెలుస్తోంది. శనివారం ఆంధ్రకు చెందిన వివిధ శాఖల విభాగాధిపతులతో హైదరాబాద్‌లో సమావేశమైన చంద్రబాబు, మరోమారు జన్మభూమి అంశాన్ని ప్రస్తావించారు. 2016 జనవరిలో తిరిగి జన్మభూమి కార్యక్రమం చేపడతామని, అధికారులు దాన్ని గతంలో మాదిరి విజయవంతం చేయాలని సూచించారు. ఈ-గవర్నెన్స్‌లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెడతామని చెప్పారు. మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం కూడా ఎంతో ప్రయోజనకారి అని వివరించారు.
భేష్ బాబూ: గవర్నర్
ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. అమరావతి శంకుస్థాపన సమయంలో గవర్నర్‌ను కలిసినా, సుదీర్ఘకాలం తర్వాత హైదరాబాద్ వచ్చిన బాబు గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, రాజధాని నిర్మాణం, ఆర్ధిక ఇబ్బందులు, తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత తదితర అంశాలపై చర్చించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా గవర్నర్ చంద్రబాబును భేష్ బాబు అంటూ అభినందించగా, మీ సహకారంతోనే ముందుకెళ్తున్నాం అంటూ సిఎం బాబు ప్రతిస్పందించినట్టు తెలిసింది. ముఖ్యమంత్రితో పాటు కేంద్ర శాస్త్ర విజ్ఞాన శాఖా మంత్రి సుజనాచౌదరి ఉన్నారు.