అంతా ఫొటోల్లోనే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంకనుండి వచ్చిన జాక్విలిన్ ఫెర్నాండెజ్ ముంబైకి నక్కతోక తొక్కి వచ్చిందని బాలీవుడ్ సినీ పండితులు చెబుతున్నారు. ఏకంగా సల్మాన్‌ఖాన్‌తోనే ‘కిక్’ చిత్రంలో నటించాక జాక్విలిన్‌కు స్టార్ తిరిగింది. ప్రతి విషయాన్ని స్టైల్‌గా ఆచరించి చూపించే జాక్విలిన్ ముంబైలో హల్‌చల్ చేస్తోంది. ఉదయానే్న నిద్రలేచిన దగ్గర్నుంచి తాను ఎక్కడికివెళితే అక్కడే ఫొటోలు తీసి అందరికీ చేరేలా చేస్తోంది. తన జీవితమంతా ఫొటోలతోనే కథ రాస్తున్నానంటూ చెప్పుకొస్తోంది. అయితే ఈ ఫొటోలను మార్ఫింగ్ చేసి ఏదేదో సృష్టించడం మాత్రం మంచిది కాదని ఆమె హెచ్చరిస్తోంది. నా గురించి తెలుసుకోవాలంటే నా ఫొటోలు వున్న మాగ్‌జైన్ చదివితే చాలు అనే భరోసా కూడా ఇస్తోంది. (చిత్రం) జాక్వెలిన్ ఫెర్నాండెజ్