రివ్యూ

కుదిరిన జత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* జత కలిసే (బాగోలేదు)

తారాగణం:
అశ్విన్, తేజస్వి, పృధ్వీ, సూర్య, షకలక శంకర్, సప్తగిరి, రామ్‌ప్రసాద్, ప్రియ, ధన్‌రాజ్, స్నిగ్ధ తదితరులు
సంగీతం: విక్కీ
నిర్మాత:
నరేష్ రావూరి
దర్శకత్వం:
రాకేష్ శశి

యువత తమకు నచ్చిందే చేయాలనుకుంటారు. అది ఎదుటివారికి ఇబ్బందికరమైనా, మంచి జరిగినా ఆలోచించరు. ముందూ వెనుకలు ఆలోచించకుండా ఏ సందర్భానికి తగినట్టు అలా ప్రవర్తిస్తు వెళ్తే, తరువాత వచ్చే పరిణామాలు ఎలావుంటాన్న కోణంలో జతకలిసే చిత్రం సాగుతుంది. ఇబ్బందులు ఎన్ని ఎదురైనా వాటిని తెలివిగా డీల్ చేస్తే ఎలా తప్పించుకోవచ్చన్న కథనంతో చిత్రం సాగింది. జర్నీ నేపథ్యంలో ఇదివరకే అనేక చిత్రాలు మనకొచ్చాయి. ఆయా చిత్రాల్లో ఏదో కొత్తదనం చూపించడానికి ప్రయత్నించారు. ఈ చిత్రం కూడా ఆ విధంగానే ప్రయత్నించింది.
కథేంటి?
ఓ పెళ్లికి హాజరైన మిత్రబృందం మద్యం తాగి పెళ్లికొడుకును అభాసుపాలు చేస్తారు. పెళ్లి ఆగిపోతుంది. తొట్టిగ్యాంగ్‌కు లీడర్ రుషి (అశ్విన్). అదే పెళ్లికి హాజరై బాధతో తిరిగి వెళ్లిపోతున్న పింకి (తేజస్వి). ఇద్దరూ ఒకే కాబ్‌లో ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఇద్దరూ కలిసి హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకూ వెళ్లాలి. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలి పెళ్లి చెడగొట్టిన రుషికి బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తుంది పింకి. ఫోన్‌ల ద్వారానే పెళ్లిలో వారుచేసిన రచ్చను ఎఫ్‌ఎం రేడియోలో, యూ ట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లలో, వార్తలతోపాటు వీడియోలు కూడా పెట్టి అభాసుపాలు చేస్తుంది. రుషి స్నేహితులు ఇదంతాచూసి ఎవరు ఇది చేస్తున్నారో కనిపెట్టే ప్రయత్నం చేస్తూ, ఫోన్‌లోనే రుషికి అన్ని విషయాలు చెబుతుంటారు. రుషి మాట్లాడే ప్రతి విషయాన్ని దగ్గరుండి వింటున్న పింకి అందుకు తగ్గ పథకాలు వేసి మెసేజ్‌ల ద్వారా తన స్నేహితులు ఏంచేయాలో చెబుతుంటుంది. ఇలా సగం ప్రయాణం జరిగేలోపు తొట్టిగ్యాంగ్ గురించి రాష్టమ్రంతా తెలిసిపోతుంది. ఎవరు చేస్తున్నారో మొదట అర్థంకాకపోయినా హ్యాకర్ ద్వారా గుర్తించి, పింకి ఇంటికి వెళతారు. అప్పటికే అక్కడ పోలీసులు సిద్ధంగా ఉండి మిత్రబృందానికి తగిన విధంగా సన్మానం చేస్తారు. ఆ దెబ్బలు తట్టుకోలేక మళ్లీ రుషికి ఫోన్ చేస్తారు. ఇవన్నీ చూసి రుషి అసలు ఏం జరుగుతుందో అర్థంకాక ఇబ్బంది పడతాడు. ఆ తరువాత ఎలాగోలాగా తన పక్కన ప్రయాణిస్తున్న పింకినే ఇదంతా చేస్తుందని గుర్తిస్తాడు. ఆమెను కోపంతో చంపడమా, లేక ప్రేమతో తనదాన్ని చేసుకోవడమా అన్న పరిస్థితిలో అతను ఏం చేశాడు అనేదే మిగతా కథనం.
ఎలా ఉంది?
సినిమా ప్రారంభం నుంచి కథనానికి తగిన విధంగా పంచ్ డైలాగులు వేసుకుంటూ కామెడీ పండిస్తూ సాగింది. రోడ్ జర్నీలో ఎన్నో వైవిధ్యమైన సన్నివేశాలను రూపొందించుకోవచ్చు కనుక అదేవిధంగా చేసుకున్నారు. అక్కడక్కడా దాబాలు, హోటల్‌లో జరిగే పరిణామాలు, మధ్యమధ్యలో లిఫ్ట్‌లు అడిగేవాళ్లతో ట్విస్టులు.. ఇలా చిత్రాన్ని బోరులేకుండా సాగించడంలో దర్శకుడు ఓకె అనిపిస్తాడు. షకలక శంకర్, సప్తగిరిలపై చిత్రీకరించిన శ్రీమంతుడు, గబ్బర్‌సింగ్ స్ఫూఫ్‌లు ఎబ్బెట్టుగాలేక ఉన్న ఐదు నిమిషాలైనా నవ్వించాయి. అయితే, షకలక శంకర్ కళ్యాణ్‌బాబుగా కథతో లింక్‌వున్న పాత్ర కావడంతో కొంచెం రిలీఫ్. నటీనటుల్లో తేజస్వి తన పాత్రవరకూ ఓకె అన్పిస్తుంది. అశ్విన్ మరికొంత కష్టపడాల్సిన అవసరం ఉంది. ఇక షకలక శంకర్, సప్తగిరి, ధన్‌రాజ్, రాంప్రసాద్ తమకు తగ్గ పాత్రల్లో ఓకె అన్పించారు. సినిమా మొదటినుండీ చివరిదాకా కనిపించే మరో పాత్ర టాక్సీ డ్రైవర్ బంగారంగా స్నిగ్థ చిత్రానికి తగ్గట్టుగానే నటించింది. సాంకేతికపరంగా కెమెరా సినిమాకు హైలెట్. పాటలు సోసో. మాటలు కథనానికి తగిన విధంగా సాగాయి. దర్శకత్వపరంగా ఉన్నంతలో పర్వాలేదనిపించే టేకింగ్‌తో ఆకట్టుకున్నారు.

-సరయు